
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని చెప్పడానికి తలసరి ఆదాయమే ప్రధాన గీటురాయి. గత ఏడేండ్లలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం దాదాపు రెట్టింపయ్యింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి రూ.1,24,104గా ఉన్న తలసరి ఆదాయం ఏడేండ్లలో 91,5% వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.2,37,632కు పెరిగింది. ఇది జాతీయ సగటు (రూ.1,28,829) కంటే 1.84 రెట్లు అధికం. దీంతో దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.86,647 నుంచి రూ.1,28,829కి చేరింది.
