Dhurandhar 2 OTT | ఓటీటీలోకి వచ్చిన భారీ బ్లాక్‌బస్టర్.. ‘ధురంధర్ ది రివేంజ్’ స్ట్రీమింగ్ ప్రారంభం
Dhurandhar 2 OTT | బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ ది రివేంజ్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
Dhurandhar 2 OTT | బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ ది రివేంజ్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ స్పందన అందుకుంది. యాక్షన్, ఎమోషన్, స్పై థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుతమైన వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో మే 15 అర్ధరాత్రి నుంచి ఈ చిత్రం ప్రసారం అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు.అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా విదేశీ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. భారతీయ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.‘రా అండ్ ఉండేఖా’ అనే ప్రత్యేక ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ డిజిటల్ వెర్షన్ దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో ఉంది. అంటే థియేటర్లలో తొలగించిన కొన్ని సన్నివేశాలను కూడా కలిపి పూర్తి అన్‌కట్ వెర్షన్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానుల్లో ఈ వెర్షన్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
గత ఏడాది విడుదలైన మొదటి భాగం ముగిసిన చోట నుంచే ఈ కథ ప్రారంభమవుతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి అజయ్ సన్యాల్ ఒక ఖైదీని అండర్‌కవర్ ఏజెంట్‌గా ఎలా మార్చాడు? అతడు కరాచీ మాఫియా ప్రపంచంలో ఎలా చొరబడ్డాడు? అక్కడ ఎదురైన ప్రమాదాలు, మిషన్ వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? అనే అంశాలతో సినిమా సాగుతుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తి స్థాయి విజువల్ ట్రీట్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా నటించగా, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

