Spirit | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ భారీ ప్లాన్.. 60 రోజుల నాన్‌స్టాప్ షెడ్యూల్‌కు సిద్ధమైన వంగా
Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన ప్రభాస్.. ఇటీవల ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించారు. ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో మరింత పవర్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన ప్రభాస్.. ఇటీవల ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించారు. ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో మరింత పవర్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర సమాచారం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ప్రభాస్ బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమా కోసం ఏకధాటిగా 60 రోజుల పాటు కొనసాగే భారీ షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఈ ఒక్క షెడ్యూల్‌తోనే సినిమాకు సంబంధించిన కీలక భాగాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ముందుకు సాగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాలకు ప్రత్యేకమైన రా అండ్ రస్టిక్ టేకింగ్ ఉంటుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ కంటే భావోద్వేగాలకు, యాక్షన్ తీవ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఈ నాన్‌స్టాప్ షెడ్యూల్లో కథకు కీలకమైన సన్నివేశాలు, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ పూర్తైతే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా తగినంత సమయం దొరుకుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి మూడు పెద్ద సినిమాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ‘స్పిరిట్’తో పాటు దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’, అలాగే నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘కల్కి 2’ చిత్రాల షూటింగ్లలో కూడా పాల్గొంటున్నారు. ఇంత భారీ ఒత్తిడి మధ్య కూడా ప్రతి సినిమాకు పూర్తి న్యాయం చేస్తూ ప్రభాస్ ఎంతో అంకితభావంతో పని చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ తొలిసారి ఒక ఇంటెన్స్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఒక బలమైన కారణంతో జైలుకు వెళ్లే పోలీస్ ఆఫీసర్‌గా ఆయన పాత్ర మరింత తీవ్రంగా, భావోద్వేగాలతో నిండుగా ఉండబోతుందట. ‘స్పిరిట్’ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎనిమిది భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

