హైదరాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారని కార్మిక సంఘాల జేఏసీ నేత లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల పేరుతో బుధవారం లేబర్ కమిషన్‌తో జరుగాల్సిన చర్చలను సైతం వాయిదా వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈయూ కేంద్ర కార్యాలయంలో బుధవారం సమావేశమైన జే ఏసీ నేతలు, జేఏసీ చైర్మన్ ఈదురు వెంక న్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లలో ఏడు సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ సమస్యలపై ప్రతిపక్ష సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఒకే రకమైన సమాధానం చెబు తూ సమస్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. విలీనం అంశాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి, గవర్నర్‌తో గెజిట్ పబ్లిష్ చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు.
ఆర్టీసీ విలీనంపై కమిటీ వేశామని, పరిశీలనలో ఉన్నదని అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుడు సమాధానం చెప్పడం సరికాదని కార్మికులు మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వం కమిటీ ఎప్పు డు వేసింది? దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఎవరు సభ్యులో మంత్రి ప్రకటించాలని జేఏసీ నేతలు డిమాండ్ చే శారు. కారుణ్య నియామకాలను ప్రభు త్వం కొత్త నియామకాలుగా చెప్పుకోవ డం విడ్డూరంగా ఉన్నదని ధ్వజమెత్తారు.
వేలాది ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చి ఆర్టీసీ ఉనికి లేకుండా చేయడం మానుకోవాల ని జేఏసీ నేతలు సూచించారు. ఆర్టీసీ డిపోలు, స్థలాలను వారికి ధారాదత్తం చే యడం ఆపాలని డిమాండ్ చేశారు. లేకపోతే ‘ఎలక్ట్రిక్ బస్ గోబ్యాక్’ నినాదంతో వాటిని అడ్డుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ ముగిసే లోపు జేఏసీకి, ఆర్టీసీతో మీటింగ్ ఏర్పాటుచేయాలని జాయింట్ లేబర్ కమిషనర్ సునీతాగోపాల్దాస్కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జే ఏసీ కోశాధికారి బీ యాదయ్య, ఏఆర్ రె డ్డి, జే రాఘవులు, కమలాకర్‌గౌడ్, స త్యం, బుద్ధ విశాల్ జీ రాములు, శ్రీనివా స్, రాంచందర్, రామిరెడ్డి పాల్గొన్నారు.