హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డీఎస్సీ-2024 నియామకాలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) డీఎడ్ కోర్సు పూర్తిచేసిన 11 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియలో ఇన్ సర్వీస్ టీచర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. అయితే ఇప్పటికే సర్వీస్‌లో ఉన్న 11 మంది టీచర్లకు సంబంధిత జిల్లాల డీఈవోలు షోకాజ్ నోటీసులు జారీచేశారు. మిమ్మల్ని ఎందుకు టెర్మినేట్ చేయకూడదో 3 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారికి ఊరట లభించనున్నది.
తప్పుల మీద తప్పులు
డీఎస్సీ-2024 కొలువుల భర్తీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి, తప్పుల మీద తప్పులు చేశారు. దీంతో ఆ నియామకాలపై రోజుకో వివాదం తలెత్తుతున్నది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తప్పిదం కూడా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. 2024 సెప్టెంబర్ 30న డీఎస్సీ ఫలితాలను వెలువరించిన ప్రభుత్వం.. ఆ అభ్యర్థులకు అక్టోబర్ 9న నియామక పత్రాలు ఇచ్చింది. లెక్క ప్రకారం 15 రోజులు నిర్వహించాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను హడావుడిగా 5 రోజుల్లోనే పూర్తిచేసింది. దీంతో తప్పులు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఇవీ వివాదాలు..