పట్టభద్రుల 1,581 దరఖాస్తుల తిరస్కరణ
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీగా దరఖాస్తులు తిరసరణకు గురవుతున్నాయి.
- కొనసాగుతున్న పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ
- పెండింగ్‌లో 4,96,112 దరఖాస్తులు
- 2023 అక్టోబర్ 31లోపు డిగ్రీ ఉత్తీర్ణులవ్వనివారి దరఖాస్తుల రిజెక్ట్
- నకిలీ సర్టిఫికెట్లతో పలువురి దరఖాస్తు
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీగా దరఖాస్తులు తిరసరణకు గురవుతున్నాయి. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా డిగ్రీ పూర్తిచేయనివారు, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నవారి ఫామ్‌లను అధికారులు సీరియస్‌గా పరిగణిస్తూ తిరసరిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు అందించిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,581 దరఖాస్తులను తిరసరించినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల్లో ఓటు నమోదు కోసం శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం 2,29,937 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 4,695 దరఖాస్తులు ఆమోదం పొందగా, 129 తిరస్కరించారు. ఇంకా 2,25,133 దరఖాస్తులు పరిశీలన ప్రక్రియ(పెండింగ్)లో ఉన్నాయి. అలాగే వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికిగాను మొత్తం 2,93,821 దరఖాస్తులు అందాయి. వీటిలో 21,390 ఆమోదం పొందగా, 1,452 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యారు. మరో 2,70,979 పరిశీలించాల్సి ఉన్నది.
ఫలితాల ఆధారాలు ఉంటే సడలింపు
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 2026 నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హకు పొందాలంటే అర్హత తేదీకి సరిగ్గా మూడేండ్ల ముందే (అంటే 2023 అక్టోబర్ 31లోపు) డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత సాధించి ఉండాలి. కానీ, ఈ తేదీ తర్వాత డిగ్రీ పూర్తయినవారు కూడా దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు వాటిని తిరసరిస్తున్నారు. కొందరు అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఓటు నమోదుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
సీఈవో కార్యాలయంలో ఉపయోగిస్తున్న అత్యాధునిక సాఫ్ట్వేర్ ద్వారా వీటిని సులభంగా ఏరివేస్తున్నట్టు స్పష్టంచేశారు. ‘2023 అక్టోబర్ 31 నాటికే డిగ్రీ ఫలితాలు వెల్లడైనట్టు తగిన ఆధారాలు చూపిస్తే, డిగ్రీ మెమో, ప్రొవిజనల్ లేదా కాన్వొకేషన్ సర్టిఫికెట్లపై ఉన్న తేదీలు అక్టోబర్ తర్వాత ఉన్నప్పటికీ ఆ దరఖాస్తులు చెల్లుబాటు అవుతాయి’ అని సీఈవో కార్యాలయ అధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుతం లక్షలాది దరఖాస్తులు పరిశీలన దశలోనే ఉన్నందున, రాబోయే రోజుల్లో మిగతా ఫామ్‌లను సమగ్రంగా తనిఖీచేసి అర్హులైన అభ్యర్థులకు మాత్రమే పట్టభద్రుల ఓటరు జాబితాలో స్థానం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

