గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్
రుక్మాపూర్‌లో పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాలు.. టీజీఎల్ఐపీసీ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు.
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : లెదర్ ఇండస్ట్రీని మరింత బలోపేతం చేయడంతోపాటు, ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో ప్రత్యేకంగా కామన్ ఫెసిలిటీ సెంటర్(సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం సచివాలయంలో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్(టీజీఎల్ఐపీసీ) ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో మాట్లాడారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో సుమారు వెయ్యి మందికి ఉపాధి కల్పించేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ హంగులతో గచ్చిబౌలిలో హబ్ అండ్ స్పోక్ విధానంలో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న సీఎఫ్‌సీ ద్వారా రాష్ట్రంలోని ఆర్టిజన్ల ఉత్పత్తులకు అదనపు విలువ(వాల్యూ యాడెడ్)ను జోడిస్తామని వెల్లడించారు.
డిజైనింగ్ మొదలు బ్రాండింగ్ వరకు వారికి మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట, ఆర్మూర్‌లో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎంఎస్ఈసీడీపీ) కింద ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సమావేశంలో తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆరేపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

