25 ఏండ్లు దాటితే కొత్తగా ఓటు కష్టమే
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తర్వాత తుది ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడినవారు తిరిగి ఓటు హకు పొందడం అంత తేలికైన విషయమేమీ కాదు.
- ‘సర్’ తర్వాత అంత ఈజీ కాదు!
- కఠిన నిబంధనలు.. క్షేత్రస్థాయి విచారణ
- 18 ఏండ్ల యువతకు సులభమైన ప్రక్రియ
- తుది జాబితాకు అర్హులు 2,55,07,734 మంది
- ఓటు నమోదుకు అనర్హులుగా 39,242 మంది
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తర్వాత తుది ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడినవారు తిరిగి ఓటు హకు పొందడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓటర్లు తిరిగి పేర్లు నమోదు చేసుకోవాలంటే ఇకపై అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ముఖ్యంగా 25 సంవత్సరాలు అంతకంటే ఎకువ వయసు ఉన్న అభ్యర్థులు కొత్త ఓటు కోసం (ఫారం 6, 6ఏ ద్వారా) దరఖాస్తు చేసుకుంటే, వారి దరఖాస్తులను అధికారులు అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనల ప్రకారం.. ఓటరు నమోదు ప్రక్రియలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 25 ఏండ్లు దాటిన అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే, వారి నివాస స్థలంలో భౌతిక విచారణ చేపడుతారు. గతంలో వారి పేరు తుది ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించబడిందనే కారణాలను స్పష్టంగా అడిగి తెలుసుకుంటారు. ఇలాంటివారు తాము భారతీయ పౌరులమని నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలను ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. తగిన ఆధారాలు ఉండి, అన్ని అర్హతలు సాధిస్తేనే వారి పేరును మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చుతారు.
డిక్లరేషన్ ఫారం తప్పుల సమర్పణపై చర్యలు
దరఖాస్తుదారులు తమ జన్మస్థలం, ప్రస్తుత నివాసం, ఎంతకాలంగా అకడ ఉంటున్నారు.. వేరే నియోజకవర్గంలో ఓటు లేదనే విషయాలపై డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్‌లో అసత్య ప్రచారం లేదా తప్పు సమాచారం ఇస్తే, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉన్నది. అయితే, కొత్తగా ఓటు హక్కు పొందాలనుకొనే యువతకు మాత్రం ఈసీఐ ఊరటనిచ్చింది. 18 ఏండ్లు పూర్తయి మొదటిసారిగా ఓటు హకు నమోదు చేసుకునే యువతకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సులభంగా ఓటు హకు లభిస్తుందని రాష్ట్ర సీఈవో కార్యాలయవర్గాలు స్పష్టం చేశాయి.
ఏఎస్‌డీడీ క్యాటగిరీలో 73,39,235 ఓటర్లు
తెలంగాణలో ‘సర్’ ప్రక్రియ ప్రారంభానికి ముందు మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ‘సర్’ ప్రక్రియలో భాగంగా 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) క్యాటగిరీలో గుర్తించిన 73,39,235 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. తారిక వ్యత్యాసాలు, 2002 సర్ మ్యాపింగ్ వివరాలు లేకపోవడంతో ఈసీఐ ఇప్పటివరకు 92,88,188 మందికి నోటీసులను జనరేట్ చేసింది.
ఇందులో 92,73,749 మందికి నోటీసులు అందజేసింది. మరో 14,439 మందికి నోటీసులు అందజేయాల్సి ఉన్నది. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు 91,09,213 మందికి విచారణలు పూర్తయ్యాయి. విచారణ అనంతరం ఆమోదం పొందిన 86.81 లక్షల మందితో కలిపి మొత్తం 2,55,07,734 మందిని తుది జాబితాలో అర్హులుగా గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 39,242 మందిని ఓటు నమోదుకు అనర్హులుగా తేలారు. ఫిర్యాదులు, అభ్యంతరాల పరిషారం, నోటీసుల విచారణ ప్రక్రియ నవంబర్ 5వ తేదీ నాటికి ముగియనున్నది. దీని ఆధారంగా సిద్ధం చేసిన తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

