మాడల్ టీచర్ల పోరుబాట
మాడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీచర్లు ఆందోళన బాట పట్టనున్నారు. ఐదు సంఘాలు మాడల్ స్కూ ల్స్ యూనియన్స్ జేఏసీ (ఎంఎస్జేఏసీ)గా ఏర్పడి పోరుబాటకు దిగాయి. ఈ మేరకు దశలవారీగా ఆందోళనలకు జేఏసీ పిలుపునిచ్చింది. మొత్తం 12 డిమాండ్లను పరిష్కరించాలని సర్కార్కు 15 రోజుల గడువును విధించింది. ఈ నెల 8వ తేదీన ప్రభుత్వానికి నోటీసు ఇవ్వగా, ఈ నెల 23తో ఈ గడువు ముగియనున్నది. ఈ గడువు ముగిసిన తర్వాత ఉద్యమం తప్పదని ఎంఎస్జేఏసీ హెచ్చిరించింది.
- ఐదు దశల ఉద్యమ కార్యాచరణ
- సర్కార్ ముందు 12 డిమాండ్లు
- 15 రోజుల్లో పరిష్కరించాల్సిందే
- లేదంటే 23 తర్వాత ఉద్యమమే: మాడల్ స్కూల్ యూనియన్ల జేఏసీ
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మాడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీచర్లు ఆందోళన బాట పట్టనున్నారు. ఐదు సంఘాలు మాడల్ స్కూ ల్స్ యూనియన్స్ జేఏసీ (ఎంఎస్జేఏసీ)గా ఏర్పడి పోరుబాటకు దిగాయి. ఈ మేరకు దశలవారీగా ఆందోళనలకు జేఏసీ పిలుపునిచ్చింది. మొత్తం 12 డిమాండ్లను పరిష్కరించాలని సర్కార్కు 15 రోజుల గడువును విధించింది. ఈ నెల 8వ తేదీన ప్రభుత్వానికి నోటీసు ఇవ్వగా, ఈ నెల 23తో ఈ గడువు ముగియనున్నది. ఈ గడువు ముగిసిన తర్వాత ఉద్యమం తప్పదని ఎంఎస్జేఏసీ హెచ్చిరించింది. ఈ మేరకు ఐదు దశల ఉద్యమ కార్యాచరణను ప్రకటిచింది. మొదటి దశలో అన్ని పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన, రెండో దశలో జిల్లా స్థాయిలో నిరసనలు-అధికారులకు వినతిపత్రాల సమర్పణ, మూడో దశలో డీఈవో, జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, నాలుగో దశలో రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఎదట మహాధర్నా, ఐదో దశలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలుపుతామని జేఏసీ నేతలు ప్రకటించారు.
రాష్ట్రంలోని 194 మాడల్ స్కూళ్లలో పనిచేస్తున్న 3,000 మంది రెగ్యులర్ టీచర్లును విలీనం చేస్తే అనేక సమస్యలు పరిష్కారమవుతాయని జేఏసీ నేతలు చెప్తున్నారు. ఏపీలో మాదిరిగా మాడల్ స్కూళ్లను పాఠశాల విద్యలో విలీనం చేసి, 010 పద్దు ద్వారా టీచ ర్లు, సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ప్రోగ్రెసివ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసొసియేన్, రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీవో 317ను అమలు చేసి, టీచర్లు, సిబ్బందిని కొత్త మల్టి జోన్లు, జోన్లు, జిల్లాలవారీగా కేటాయించాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాకమల్లు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

