డీఎస్సీ-2008లో డీఎడ్ అభ్యర్థులకు
డీఎస్సీ-2008 ఎస్జీటీ ఉపాధ్యాయ నియామకాల్లో డీఎడ్ అర్హత ఉన్న అభ్యర్థులకు 30% పోస్టులు కేటాయించడం సబబేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన జీవో 28ను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. 2008లో ఎస్జీటీ, సూల్ అసిస్టెంట్ తదితర 52,665 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత ఎస్జీటీలో డీఎడ్ అభ్యర్థులకు 30% కేటాయించడాన్ని సవాలు చేస్తూ 2009లో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాం కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.
- 30% పోస్టుల కేటాయింపు సబబే
- ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2008 ఎస్జీటీ ఉపాధ్యాయ నియామకాల్లో డీఎడ్ అర్హత ఉన్న అభ్యర్థులకు 30% పోస్టులు కేటాయించడం సబబేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన జీవో 28ను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. 2008లో ఎస్జీటీ, సూల్ అసిస్టెంట్ తదితర 52,665 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత ఎస్జీటీలో డీఎడ్ అభ్యర్థులకు 30% కేటాయించడాన్ని సవాలు చేస్తూ 2009లో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాం కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. నోటిఫికేషన్ జారీచేశాక నిబంధనలను సవరించడం ఆట మొదలయ్యాక నిబంధనలను మార్చినట్టవుతుందని, ఇది చెల్లదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేరొన్నారు. నిబంధనలు మార్చిన తరువాత అదనపు నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలిపారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సవరణ వివరాలను 2009 జనవరి 29న పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించామని స్పష్టం చేశారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

