డీహెచ్లో అవినీతిపై సీఎంవో ఎంక్వైరీ!
వైద్యారోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) విభాగంలో తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులు విచారణ చేపట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ విభాగంలోని అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు గత కొన్ని నెలలుగా మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆరుగురు సీఎంవో అధికారులు డీహెచ్లో కీలకాధికారి వద్ద కూర్చుని విచారణ చేపట్టినట్టు సమాచారం.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) విభాగంలో తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులు విచారణ చేపట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ విభాగంలోని అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు గత కొన్ని నెలలుగా మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆరుగురు సీఎంవో అధికారులు డీహెచ్లో కీలకాధికారి వద్ద కూర్చుని విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈ సందర్భంగా పలు ఫైళ్లను తెప్పించుకుని ఆ కీలకాధికారిపై ప్రశ్నల వర్షం కురిపించారని, ఆవిభాగంలో దస్ర్తాలు ఎందు కు ఆగుతున్నాయంటూ ఆరా తీశారని తెలిసింది. విజిలెన్స్ ఫైళ్లు క్లియర్ చేయడం వెనుక జరుగుతున్న వసూళ్ల దందా, నర్సింగ్ ఉద్యోగాల్లో చేరిన సిబ్బంది రెగ్యులరైజేషన్కు సంబ ంధించిన ఫైళ్లను క్లియర్ చేయకుండా ఆపడం, ఇన్వార్డులో ఫైళ్లు నెలల తరబడి ఆగడంపై ఆరా తీయడంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను సైతం తొక్కిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
విచారణకే పరిమితమా?
డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో కీలకాధికారి సహా పలువురు అధికారులపై చాలా కాలం నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ‘వైద్యశాఖలో అవినీతి వైరస్’, ‘ఏవో ప్రమోషన్లలో గోల్మాల్’ ‘డీహెచ్లో షాడోల హల్చల్!’ అనే శీర్షికలతో ‘నమస్తే తెలంగాణ’లో కథనాలు ప్రచురితమయ్యాయి. వీటితోపాటు పలు ఇతర కథనాల ఆధారంగా సీఎంవో అధికారులు డీహెచ్ కార్యాలయంలో విచారణ చేపట్టినట్టు తెలిసింది. దీంతో ఆ కీలకాధికారి, ఆయనకు కలెక్షన్ ఏజెంట్లా పనిచేస్తున్న ఇతర అధికారులు ఉలిక్కిపడినట్టు సమాచారం. ఈ విచారణ పూర్తికాగానే ఆ కీలకాధికారి హుటాహుటిన సెలవు పెట్టి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఆ కీలకాధికారి వచ్చే ఏడాది జనవరిలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో సీఎంవో అధికారుల విచారణ ఇక్కడికే పరిమితమవుతుందా? లేక చర్యలు తీసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

