హ్యామ్రోడ్ల పనుల్లో తెలంగాణ కాంట్రాక్టర్లకు మొండిచేయి
రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న రోడ్ల నిర్మాణ ప్రాజెక్టుల్లో తెలంగాణ కాంట్రాక్టర్లకు చుకెదురవుతున్నది.
- 17 ప్యాకేజీలూ ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లకే అప్పగింత
- ఏపీకి 2, ఇతర రాష్ర్టాల కాంట్రాక్టర్లకు 15 ప్యాకేజీలు
- మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,007 కోట్లు
- కాగితాలకే పరిమితమైన కాంగ్రెస్ సర్కార్ హామీలు
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న రోడ్ల నిర్మాణ ప్రాజెక్టుల్లో తెలంగాణ కాంట్రాక్టర్లకు చుకెదురవుతున్నది. తెలంగాణ ప్రజల సొమ్ముతో హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) పద్ధతిలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో రాష్ట్ర కాంట్రాక్టర్లకు అవకాశం దకకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తం 17 ప్యాకేజీలకు సంబంధించిన కాంట్రాక్టులో తెలంగాణ కాంట్రాక్టర్లకు ఒక్క ప్యాకేజీ కూడా దకకపోవడంపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రూ.6,294.81 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంట్రాక్టర్లకు రెండు ప్యాకేజీలు దక్కాయి.
మిగిలిన 15 ప్యాకేజీలను ఇతర రాష్ట్రాల కంపెనీలు, ఏజెన్సీలు దకించుకున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు పనులు పూర్తిచేసిన తెలంగాణ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం దాదాపు రూ.500-600 కోట్ల బకాయి పడింది. మూడేండ్లయినా వాటిని ఇంకా చెల్లించలేదు. ‘హ్యామ్’ రోడ్ల డబ్బులు కూడా ఇస్తుందో, ఇవ్వదో అన్న సందేహంతో తెలంగాణ కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లలో పాల్గొనడం లేదు. దీంతో ఇతర రాష్ర్టాల కాంట్రాక్టర్లు, కంపెనీలు, ఏజెన్సీలు టెండర్లలో పాల్గొని తెలంగాణ ప్రాజెక్టులను దక్కించుకుంటున్నాయి. అన్ని కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 15% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ కాంగ్రెస్ సర్కార్ అమలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో మండలాలు, గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లాంటి స్థానిక నాయకులు, చిరు కాంట్రాక్టర్లు చేపట్టేవారు. అలా రూ.10 లక్షల విలువైన పనిచేస్తే వారికి రూ.1-2 లక్షలు మిగిలేవి. వాటితో పార్టీ క్యాడర్ను కాపాడుకొనేవారు. ఇప్పుడు కాంట్రాక్ట్ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇతర రాష్ర్టాల్లో 2016లోనే మొదలైన ‘హ్యామ్’ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్నది. ‘హ్యామ్’ అనేది పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానం. ఈ పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టు ఖర్చులో 40 శాతాన్ని ప్రభుత్వం నిర్మాణ దశలోనే చెల్లిస్తుంది. మిగిలిన 60% నిధులను కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా సమీకరిస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సదరు రహదారి నిర్మాణం పూర్తయ్యాక నిర్వహణ ఖర్చులతో కలిపి ప్రతి 6 నెలలకు ఓ వాయిదా చొప్పున 15 ఏండ్లపాటు చెల్లిస్తుంది. అప్పటివరకు ఆ రహదారి నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్దే.
గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ‘హ్యామ్’ విధానాన్ని అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా నిర్వహణ ఖర్చులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.16,007 కోట్ల పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. వీటిలో తొలి దశ పనులకు రూ. 6,294 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఫేజ్-1లో 17 ప్యాకేజీల కింద 96 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,449.50 కి.మీ. పొడవైన 2,162 రహదారులు నిర్మించనున్నారు. ఇప్పటివరకు ఎలాంటి రోడ్డు సౌకర్యానికి నోచుకోని 176 గ్రామ పంచాయతీలకు తొలిసారి కొత్తగా 934 కి.మీ. బీటీ (తారు) రోడ్లు నిర్మిస్తారు. ఇప్పటికే దెబ్బతిన్న 5,490 కి.మీ. బీటీ రోడ్లకు మరమ్మతులు చేస్తారు. రద్దీ ఎక్కువగా ఉన్న 1,024 కి.మీ. సింగిల్ లేన్ బీటీ రోడ్లను 2 లేన్లకు విస్తరిస్తారు. ఫేజ్-1లో 2,162 రహదారుల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. దసరా నుంచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు మంత్రి సీతక్క ప్రకటించారు. కానీ, పండుగ నాటికి ఈ పనులు ప్రారంభయ్యే పరిస్థితి లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి.
రూ.500-600 కోట్ల బిల్లులు పెండింగ్
రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.500-600 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టింది. దీంతో ఆ కాంట్రాక్టర్లు ఇటీవల సచివాలయంలో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పాత బిల్లులను చెల్లించకపోవడంతో వారు కొత్త పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా ‘హ్యామ్’ రోడ్ల టెండర్లను ఇతర రాష్ట్రాల కంపెనీలు, ఏజెన్సీలు దకించుకున్నాయి.
ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఎకడ?
కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 15% రిజర్వేషన్ కల్పిస్తామంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ‘హ్యామ్’ రోడ్లలో ఎస్సీలకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు కల్పిస్తామన్న హామీలను ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రూ.6,294.81 కోట్ల విలువైన ప్రాజెక్టులో తెలంగాణ కాంట్రాక్టర్లకు ఒక ప్యాకేజీ కూడా దకకపోవడానికి కారణాలేమిటో వెల్లడించాలని, తమ పెండింగ్ బిల్లుల చెల్లించాలని స్థానిక కాంట్రాక్టర్లు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

