భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి
ఢిల్లీతోపాటు భారత్లోని ఇతర ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనల సమయంలో మితిమీరిన బలప్రయోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణల గురించి భారతీయ ప్రతినిధుల వద్ద ప్రస్తావించాలని పమీలా జయపాల్, ఇల్హాన్ ఒమర్లతో సహా ఆరుగురు అమెరికా డెమోక్రటిక్ చట్టసభ్యులు తమ విదేశాంగ మంత్రి మార్కో రూబియోను కోరారు.
- సీజేపీకి మద్దతుగా అమెరికాలో జరిగిన నిరసనలపై నిఘా పెట్టారు
- 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
- అమెరికా మంత్రి రూబియోకు ఆరుగురు చట్టసభ్యుల లేఖ
వాషింగ్టన్: ఢిల్లీతోపాటు భారత్లోని ఇతర ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనల సమయంలో మితిమీరిన బలప్రయోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణల గురించి భారతీయ ప్రతినిధుల వద్ద ప్రస్తావించాలని పమీలా జయపాల్, ఇల్హాన్ ఒమర్లతో సహా ఆరుగురు అమెరికా డెమోక్రటిక్ చట్టసభ్యులు తమ విదేశాంగ మంత్రి మార్కో రూబియోను కోరారు. అమెరికాలో కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్న నిరసనకారులపై వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం, ఇతర అమెరికన్ నగరాల్లోని కాన్సులేట్లు ఫొటోగ్రాఫర్లను నియమించాయని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు పమీలా జయపాల్, ఒమర్, జిమ్ మెక్గవర్న్, రషీదా త్లెయిబ్, ఎలియనోర్ హోమ్స్ నార్టన్, జీస్ గార్సియా ఆరోపించారు. రూబియో వచ్చేవారం భారత్లో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ను కలవనున్నారు.
అంతర్గత వ్యవహారాల్లో జోక్యం
పమీలా జయపాల్ చేసిన వ్యాఖ్యలను అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తీవ్రంగా విమర్శిస్తూ వాటిని భారత అంతర్గత వ్యవహారాల్లో ఆమోదయోగ్యం కాని జోక్యంగా పేర్కొన్నారు. రూబియోకు రాసిన లేఖపై పమీలా జయపాల్ను డెమోక్రటిక్ నాయకుడు, వైట్ హౌస్ మాజీ సలహాదారు అజయ్ జైన్ భుటోరియా తీవ్రంగా విమర్శించారు.
యూఎన్ విశ్వసనీయతపై ప్రశ్నలు
మానసిక ఆరోగ్యం లేదా లింగ సమానత్వం గురించి చర్చించినందుకు భారత్లోని యువత ప్రతీకారం లేదా వివక్షను ఎదుర్కొంటున్నారన్న ఐక్యరాజ్యసమితి(యూఎన్) ప్రత్యేక ప్రతినిధి గీనా రొమెరో వ్యాఖ్యలను భారత్ పూర్తిగా తిరస్కరించింది. ఈ ఆరోపణలు నిరాధార, ధృవీకరించని వాదనలుగా యూఎన్లోని భారత దౌత్యవేత్త అనుజ్ స్వరూప్ ఖండించారు. రొమెరో నివేదికను ప్రస్తావిస్తూ భారత్లోని యువతకు సంబంధించి అందులోని వాదనల ఆధారాలను ఆయన ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా భారత్లో యువత విస్తృతంగా నిరసనలు తెలియచేస్తున్న నేపథ్యంలో ఈ నివేదికను సమర్పించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

