హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్తో భాదపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు గురువారం రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు.
ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.