1. కింది వాక్యాలను పరిశీలించండి. సరైనది గుర్తించండి.
1. ధర్మపురికి 19 కి.మీ. దూరంలోగోదావరి నది ఒడ్డున ఉన్న కోటిలింగాల గ్రామంలో తెలంగాణ చరిత్రకు సంబంధించి మొదటి శిలాశాసనాలు, నాణేలు లభ్యమయ్యాయి.
2. ఈ గ్రామంలో శాతవాహన రాజులు 2, 3 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించిన శివుడి శ్రీకోటేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధ
పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది
3. ఇక్కడ లభించిన నాణేలపై శాతవాహన పూర్వకాలం నాటి స్థానిక రాజులైన గోబద,
సిరకంవాయు, సిరివాయు, సిరినారన,సమగోప పేర్లు ఉన్నాయి
1) 1 2) 2
3) 1, 3 4) 1, 2, 3
2. తెలంగాణలోని జీవనది అయిన గోదావరి నదిని ప్రాచీన కాలంలో ఏమని వ్యవహరించేవారు?
1) తెలివాహ నది 2) తుల్యభాగ నది
3) ఆత్రేయ 4) గౌతమి
3. లభ్యమైన ఆధారాలు, నాణేలు బట్టి కోటిలింగాల గ్రామం 16 మహాజనపదాల్లో ఏ జనపదానికి సంబంధించినదిగా గుర్తించారు?
1) అవంతి 2) కోసల
3) అస్మక 4) ఛేది
4. జగిత్యాల జిల్లా, వెల్గటూరు మండలంలో ఉన్న కోటిలింగాల్లో లభ్యమైన శాసనాలను ఏ లిపిలో లిఖించారు?
1) బ్రాహ్మీ లిపి 2) సంతాలి
3) పాలి 4) నగరి
5. ‘తెలంగాణ పురం’ అనే అంశం ఏ శాసనంలో ప్రస్తావించారు?
1) నాసిక్ శిలా శాసనం
2) సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ శాసనం
3) హాథిగుంఫా శాసనం
4) కోటిలింగాల శాసనం
6. హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ 1953లో ప్రచురించిన ‘యాంటిక్వేరియన్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్’ అధ్యయన గ్రంథం ఎన్ని స్థలాలను సంరక్షిత స్థలాలుగా పేర్కొంది?
1) 118 2) 111
3) 88 4) 218
7. కింది రెండు వాక్యాల్లో సరైనది గుర్తించండి.
ప్రతిపాదన (ఎ) – తెలివాహ నది పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలను త్రిలింగులుగా వ్యవహరించి, కాలక్రమంలో త్రిలింగ దేశాన్ని ‘తెలంగాణ’గా స్థిరపడి ఉండవచ్చు అని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయపడ్డారు
కారణం (ఆర్) – గాంగ వంశస్థుడైన ఇంద్రవర్మ వేయించిన ‘పుర్లి శాసనం’ నుంచి మొదలుకొని, వివిధ కాకతీయ శాసనాల్లో త్రిలింగ, తిలింగ, తెలంగ అనే మూడు పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగించారు
1) ప్రతిపాదన (ఎ) కారణం (ఆర్) రెండూ
సరైనవే, (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) ప్రతిపాదన (ఎ) కారణం (ఆర్) రెండూ సరైనవే, (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనదే కాని, (ఆర్) సరైన
వివరణ కాదు
4) (ఎ) సరైనది కాదు, (ఆర్) సరైన వివరణ
8. కింది ఏ శాసనంలో ‘తెలంగాణ’అనే పదం ప్రస్తావనకు వచ్చింది?
1) విక్రమేంద్ర వర్ధముడి చిక్కుళ్ల శాసనం
2) అశోకుని ఎర్రగుడిపాడు శాసనం
3) ప్రతాపరుద్ర గణపతి 1510లో
వేయించిన వెలిచర్ల శాసనం
4) గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనం
9. చరిత్రకారుడు బి. సుబ్రమణ్యం రచించిన ఏ పుస్తకం తెలంగాణ చరిత్ర పూర్వయుగ అధ్యయనానికి ఉపయుక్తమైన గ్రంథంగా భావించవచ్చు?
1) తెలుగు నేలపై పరిశోధనలు
2) యాంటిక్వేరియన్ రిమైన్స్ ఆఫ్
హైదరాబాద్ స్టేట్
3) అమరచిత్ర కథ
4) ఇండియాస్ యాన్షియంట్ పాస్ట్
10. తెలంగాణ అనే పేరుకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. సరైన వాక్యాలను గుర్తించండి.
1. మహ్మద్‌బీన్ తుగ్లక్ కాకతీయ రాజ్యాన్ని జయించిన తర్వాత ముస్లిం త్రిలింగ దేశాన్ని తెలంగాణ అని వ్యవహరించారు
2. తుగ్లక్ సేనాని అనూర్‌వలి ఓరుగల్లు
ఆక్రమణ ఆగిపోయిన తర్వాత కోస్తాపై దండెత్తాడు. అప్పుడు తన శాసనాల్లోనూ, పరిపాలనా కైఫియత్తుల్లోనూ తెలంగాణ అని రాయించాడు
3. కోస్తా ప్రాంతం నిజాం కాలంలో బ్రిటిష్ వారికి వచ్చింది. అప్పుడు ఆ ప్రాంతాన్ని తిరిగి ఆంధ్ర అని వ్యవహరించారు. నిజాం పాలనలోని ప్రాంతానికి తెలంగాణ అనే పేరు స్థిరపడింది
1) 1 2) 2
3) 1, 3 4) 1, 2, 3
11. తెలంగాణలో చారిత్రక పూర్వయుగం గురించి పరిశోధనలు ప్రారంభించిన మొదటి వ్యక్తి?
1) రాబర్ట్ బ్రూస్‌ఫుట్ 2) డీడీ కోశాంబి
3) ఆర్.ఎస్. శర్మ 4) పరబ్రహ్మశాస్త్రి
12. తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో మొదటి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశంగా ఖ్యాతి గడించింది ఎవరు?
1) చాళుక్యులు 2) విష్ణుకుండినులు
3) శాతవాహనులు 4) ఇక్షాకులు
13. తెలంగాణలో చారిత్రక యుగం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది?
1) 2వ శతాబ్దం నుంచి
2) 6వ శతాబ్దం నుంచి
3) 3వ శతాబ్దం నుంచి
4) 9వ శతాబ్దం నుంచి
14. పురాణాలు ‘ఆంధ్రభృత్యులు’ అని ఎవరిని పేర్కొన్నాయి?
1) విష్ణుకుండినులు 2) కాకతీయులు
3) ఇక్షాకులు 4) శాతవాహనులు
15. జతపరచండి.
1. శాతవాహనుల ఎ. ప్రతిష్ఠాపురం
మొదటి రాజధాని
2. శాతవాహనుల బి. కోటిలింగాల
రెండో రాజధాని
3. శాతవాహనుల సి. ధాన్య కటకం
మూడో రాజధాని
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-ఎ, 2-సి, 3-బి
16. శాతవాహనుల రాజ భాష ఏది?
1) సంస్కృతం 2) హిందీ
3) తెలుగు 4) ప్రాకృతం
17. శాతవాహనుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు ?
1) గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్
2) మార్కోపోలో
3) నికోలొకంటి 4) థామస్ రో
18. కింది వాక్యాల్లో సరికానిది గుర్తించండి.
1. శాతవాహన అనే పదానికి కన్నడంలో
రైతు అని అర్థం
2. ద్రావిడ దేశం, ఆర్యవర్తన దేశం మధ్య సాంస్కృతిక సమన్వయాన్ని సాధించి శాతవాహనులు చారిత్రాత్మక ప్రాతను పోషించారు అని ప్రముఖ చరిత్రకారుడు కే.ఎం ఫణిక్కర్ పేర్కొన్నారు
3. శాతవాహనుల రాజధాని విజయపురి
1) 1 2) 2
3) 3 4) 1, 2
19. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు?
1) శ్రీముఖుడు 2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) కన్హుడు 4) కుంతల శాతకర్ణి
20. శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు శూద్రుడు అని తెలియచేసింది ఎవరు?
1) నాసిక్ నాశనం 2) కల్ప ప్రదీప గ్రంథం
3) ప్రాచీన వాజ్ఞయం
4) ద్వాత్రింశిక పుత్తలిక గ్రంథం
21. గౌతమీపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణుడు అని ఎవరు పేర్కొన్నారు?
1) నాసిక్ శాసనం
2) ద్వాత్రింశిక పుత్తలిక గ్రంథం
3) కల్ప ప్రదీప గ్రంథం
4) పురాణాలు
22. శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి వివిధ వాదాలను సరిగా జతపరచండి.
వాదం జన్మస్థలం
ఎ. తెలంగాణ వాదం 1. ప్రతిష్ఠానపురం
బి. కర్ణాటక వాదం 2. ధాన్యకటకం
సి. కోస్తాంధ్ర వాదం 3. బళ్లారి
డి. మహారాష్ట్ర వాదం 4. కోటిలింగాల
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
23. శాతవాహనుల పాలన మొదట తెలంగాణలో ప్రారంభమైన తర్వాత క్రమంగా పశ్చిమ, ఉత్తర, దక్షిణాలకు విస్తరించిందని పేర్కొన్న చరిత్ర పరిశోధకుడు ?
1) ఆర్.జీ భండార్కర్
2) పీ.టీ శ్రీనివాస అయ్యంగార్
3) కంభంపాటి సత్యనారాయణ
4) కే గోపాలచారి
24. చరిత్రకారుల ప్రకారం శాతవాహనుల కాలంలో రోమన్ సామ్రాజ్యంలో జరిగే వాణిజ్యానికి కింది వాటిలో ఏది ప్రధాన కేంద్రంగా ఉంది?
1) కోటిలింగాల 2) పెద్ద బంకూరు
3) కొండాపూర్ 4) ధూళికట్ట
25. శ్రీముఖుడి పాలనా కాలంలో తెలంగాణలో పేరుపొందిన జైన క్షేత్రం ఏది?
1) మునులగుట్ట 2) కొలనుపాక
3) శ్రీముఖలింగం 4) బాసర
జవాబులు
1.4 2.1 3.3 4.1
5.2 6.1 7.1 8.3
9.1 10.4 11.1 12.3
13.2 14.4 15.1 16.4
17.1 18.3 19.1 20.3
21.1 22.2 23.3 24.3
25.1 26.1 27.2 28.4
30.3 31.1 32.3 33.1
34.3 35.1 36.1 37.4
38.2 39.1 40.2 41.3
-కళ్యాణ్ గౌడ్
ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్