KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్‌పై స్టేటస్కో.. జప్తు చర్యలకు హైకోర్టు బ్రేక్.. నవంబర్ 6 వరకు యథాతథ స్థితి
KTR | ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తునకు సంబంధించి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం చేపట్టిన చర్యల పై హైకోర్టు స్టేటస్ కో విధించింది. నవంబర్ 6 వ రకు యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
KTR | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తునకు సంబంధించి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం చేపట్టిన చర్యల పై హైకోర్టు స్టేటస్ కో విధించింది. నవంబర్ 6 వ రకు యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పాస్‌పోర్ట్ జప్తు పై అక్టోబర్ 13న జారీచేసిన ప్రొసీడింగ్స్‌తోపాటు సెప్టెంబర్ 28న ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ మంగళవారం విచారణ చేపట్టారు.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, ఏసీ బీ డీజీకి నోటీసులు జారీచేశారు. చార్జిషీట్ దాఖలై, కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో పాస్‌పోర్ట్ కార్యాలయానికి సమాచారం ఇచ్చేముందు కోర్టు అ నుమతి తీసుకున్నారా? అని న్యాయమూర్తి ఏసీబీని ప్రశ్నించారు. కోర్టు అనుమతి లేకుండా ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఏసీబీకి ఉన్న దా? అని ప్రశ్నించగా, ఏసీబీ కోర్టులో మెమో దాఖ లు చేసి సమాచారం ఇచ్చినట్టు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.
చార్జిషీట్ దాఖలయ్యాక ప్రయాణంపై ఆంక్షలా!
కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయలేదని, ఇప్పటికే చార్జిషీట్ దాఖలైందని తెలిపారు. చార్జిషీట్ దాఖలైన అనంతరం కేటీఆర్ ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారని, కోర్టు ఆయన ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ పాస్‌పోర్ట్ అధికారి ఏకపక్షంగా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా పాస్‌పోర్ట్ జప్తునకు చర్యలు చేపట్టారని, ఇవి పిటిషనర్ ప్రాథమిక హకులకు భంగం కలిగిస్తాయని తెలిపారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బీ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. పాస్‌పోర్ట్ అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు కేటీఆర్‌కు అవకాశం కల్పించామని తెలిపారు. చట్టంలో అలాంటి అవకాశం కల్పించాలన్న నిబంధన లేకపోయినా, పిటిషనర్ అభ్యర్థన మేరకు వ్యక్తిగత విచారణకు అనుమతించామని, ఇప్పటివరకు పాస్‌పోర్ట్‌ను జప్తు చేయలేదని వివరించారు.
పిటిషన్లో కేటీఆర్ అభ్యంతరాలు
పాస్‌పోర్ట్ జప్తు చర్యలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లో కేటీఆర్ పలు న్యాయపరమైన అభ్యంతరాలను లేవనెత్తారు. పాస్‌పోర్ట్ జప్తునకు ప్రతిపాదిస్తూ సెప్టెంబర్ 28న షోకాజ్ నోటీసు జారీచేసిన అధికారులు, దానికి ఆధారంగా పేరొన్న ఏసీబీ నివేదికతోపాటు సంబంధిత పత్రాలను తనకు అందించలేదని తెలిపారు. ఆ పత్రాలు లేకుండా ఆరోపణలపై సమగ్రంగా సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నారు. అందువల్ల అక్టోబర్ 10న సమాధానం ఇచ్చి సంబంధిత పత్రాలను అందించాలని, తదుపరి నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిపారు. అయితే, తన వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే అక్టోబర్ 13న పాస్‌పోర్ట్ జప్తునకు సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీచేశారని ఆరోపించారు. వ్యక్తిగత విచారణకు పిలిచినప్పుడే పాస్‌పోర్ట్ జప్తు చేస్తామని పేరొనడం ద్వారా అధికారులు ముందుగానే నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతున్నదని తెలిపారు.
వ్యక్తిగత విచారణ అనేది కేవలం ప్రక్రియను పూర్తి చేసే లాంఛనంగా మారకూడదని, సంబంధిత పత్రాలు అందించి తన వాదనలు సమర్థంగా వినిపించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఏసీబీ కేసులో దర్యాప్తు సమయంలో తాను అధికారుల ఎదుట హాజరయ్యానని, కోర్టు విచారణకు కూడా హాజరవుతున్నానని పిటిషన్లో పేరొన్నారు. పాస్‌పోర్ట్ జప్తు చేయాల్సిన అవసరాన్ని సమర్థించే విధంగా తన ప్రయాణాలపై ఎలాంటి న్యాయపరమైన ఆంక్షలు లేవని తెలిపారు. ఏసీబీ కోర్టులో పాస్‌పోర్ట్ డిపాజిట్ చేయాలని మెమో దాఖలైన నేపథ్యంలో అదే సమయంలో పాస్‌పోర్ట్ జప్తునకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం చర్యలు చేపట్టడం సముచితం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని, రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణల కింద తనకు లభించిన హకులకు భంగం కలిగిస్తాయని పేరొన్నారు. సంబంధిత ప్రొసీడింగ్స్, షోకాజ్ నోటీసులను రద్దు చేయాలని, తదుపరి చర్యలను నిలిపివేయాలని హైకోర్టును అభ్యర్థించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్‌పై స్టేటస్కో.. జప్తు చర్యలకు హైకోర్టు బ్రేక్.. నవంబర్ 6 వరకు యథాతథ స్థితి
Trump | బట్టలు చించి, రక్తమొచ్చేలా గాయపర్చి లైంగిక దాడి చేశారు.. ట్రంప్‌పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన ఆరోపణలు
‘బుర్ర తక్కువ మాటలు సాలు.. ఊకో’.. ఇందిరమ్మ ఇల్లడిగిన మహిళను కించపరిచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి!
ఫీజు ఎగవేతకు సర్కార్ కుట్ర.. రీయింబర్స్మెంట్ దరఖాస్తులకు సాంకేతిక చిక్కులు!
Tummidihatti | తమ్మిడిహట్టి అంతులేని కథ.. 21 ఏండ్లుగా కాంగ్రెస్ నడిపే దగా నాటకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

