తమ్మిడిహట్టి అంతులేని కథ!
కాంగ్రెస్ కుటిల రాజకీయ విషవలయంలో చిక్కుకున్న ప్రాజెక్టు తమ్మిడిహట్టి.. దాదాపు 21 ఏండ్లుగా ఆ పార్టీ పబ్బం గడుపుకోవడానికే తప్ప.. తట్టెడు మట్టి ఎత్తిందీ లేదు, ఒక్క ఇటుక పేర్చిందీ లేదు. అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి లభ్యతలేని ప్రదేశాలు, అనుమతులు రానిచోట ప్రాజెక్టులు.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా ఉమ్మడిరాష్ట్రంలో సమైక్యపాలకులు చేసిన కుట్రలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తమ్మిడిహట్టిది అంతులేని కథ.. తీరని వ్యథ! ‘అదిగో ప్రాజెక్టు.. ఇదిగో గోదావరి జలాలు’ అంటూ నాడు దశాబ్దంపాటు ఏమార్చిన ఇదే కాంగ్రెస్.. ఇప్పుడు మూడేండ్లుగా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నది.
- 21 ఏండ్లుగా కాంగ్రెస్ నడిపే దగా నాటకం
- చర్చలు ఆగవు.. అనుమతులు రావు.. పనులు సాగవు
- మూడేండ్లలో కాళేశ్వరం కట్టిచూపించిన కేసీఆర్
- మూడేండ్లుగా కనీసం రిపేర్ కూడా చేయలేని రేవంత్
- అసలు పని వదిలి, కాంగ్రెస్ కొసరు పనులు
- 2014 వరకు ఒక్క అనుమతినీ సాధించని హస్తం
- అధికారంలోకి రాగానే మహారాష్ట్రతో కేసీఆర్ చర్చలు
- ముంపు నేపథ్యంలో ముందుకు సాగదని నిర్ధారణ
- రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టు రీడిజైన్
- కాంగ్రెస్ తవ్వివదిలేసిన ప్రాణహిత కాలువలకు జీవం
- నేడు మళ్లీ తమ్మిడిహట్టి అంటూ కాంగ్రెస్ పాత రాగం
- 2008లో శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ సర్కార్
- బరాజ్ ఎత్తుపై పొరుగు రాష్ట్రం తీవ్ర అభ్యంతరం
- అసలు పని వదిలి, కొసరు పనులు కొనసాగింపు
- మహారాష్ట్రతో చర్చల పేరిట కాంగ్రెస్ ఏడేండ్లు సాగదీత
- 2014 వరకు ఒక్క అనుమతినీ సాధించని కాంగ్రెస్
- అధికారంలోకి రాగానే మహారాష్ట్రతో కేసీఆర్ చర్చలు
- ముంపు నేపథ్యంలో ముందుకు సాగదని నిర్ధారణ
- ఆశించిన నీటి లభ్యత ఉండదని తేల్చిన సీడబ్ల్యూసీ
తెలంగాణ నీటి అవసరాలు తీర్చేలా లేదన్న నిపుణులు - రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టు రీడిజైన్
- వార్ధా ద్వారా ఆదిలాబాద్ ఆయకట్టుకు భరోసా
- కాంగ్రెస్ తవ్వివదిలేసిన ప్రాణహిత కాలువలకు జీవం
- మూడేండ్లలో అనుమతులు సహా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి
- ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పడావు పెట్టిన రేవంత్ సర్కార్
- నేడు మళ్లీ తమ్మిడిహట్టి అంటూ పాత రాగం
- పొరుగురాష్ట్రంతో చర్చలకే మూడేండ్ల సమయం
- రాజకీయాలే తప్ప నీళ్ల సోయిలేని కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ కుటిల రాజకీయ విషవలయంలో చిక్కుకున్న ప్రాజెక్టు తమ్మిడిహట్టి.. దాదాపు 21 ఏండ్లుగా ఆ పార్టీ పబ్బం గడుపుకోవడానికే తప్ప.. తట్టెడు మట్టి ఎత్తిందీ లేదు, ఒక్క ఇటుక పేర్చిందీ లేదు. అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి లభ్యతలేని ప్రదేశాలు, అనుమతులు రానిచోట ప్రాజెక్టులు.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా ఉమ్మడిరాష్ట్రంలో సమైక్యపాలకులు చేసిన కుట్రలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తమ్మిడిహట్టిది అంతులేని కథ.. తీరని వ్యథ! ‘అదిగో ప్రాజెక్టు.. ఇదిగో గోదావరి జలాలు’ అంటూ నాడు దశాబ్దంపాటు ఏమార్చిన ఇదే కాంగ్రెస్.. ఇప్పుడు మూడేండ్లుగా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నది.
తమ్మిడిహట్టి.. కాంగ్రెస్ కుటిల రాజకీయ విషవలయంలో చిక్కుకున్న ప్రాజెక్టు. దాదాపు 20 ఏండ్లుగా వారి పబ్బంగడుపుకోవడానికే తప్ప.. తట్టెడు మట్టి ఎత్తిందీ లేదు, ఒక్క ఇటుక పేర్చిందీ లేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి 2005లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు బరాజ్ నిర్మాణం చర్చలు, పేపర్లమీదే కొనసాగుతున్నది. వైఎస్సార్ ప్రభుత్వం 2005లో డీపీఆర్ తయారీకి జీవోలు ఇచ్చింది. 2007లో 152 మీటర్లతో బరాజ్‌ను నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 2008 నవంబర్‌లో శంకుస్థాపన చేసింది. అంతకుమించి బరాజ్ నిర్మాణం ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేదు. మహారాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో చర్చలు మొదలుపెట్టారు. సుమారు 20 ఏండ్ల తర్వాత ఇప్పుడు కూడా తమ్మిడిహట్టి చర్చల దశలోనే ఉండటం గమనార్హం. పైగా 2007 నుంచి 2014 వరకు అటు కేంద్రంలో, ఇటు ఉమ్మడి ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అయినా ప్రాజెక్టుకు అనుమతులు రాలేదు. ఇది ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనం.
ఈలోగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని రికార్డు స్థాయిలో మూడేండ్లలోనే పూర్తి చేసి, నీళ్లు ఎత్తిపోశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సైతం దాదాపు పూర్తి చేశారు. కానీ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్లలో ప్రాజెక్టును పూర్తిచేయడం కాదు కదా.. కనీసం కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు కూడా చేయించలేకపోయింది. ఇప్పుడు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం అంటూ పాత కథను కొత్తగా ముందు వేసుకున్నది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎంతో చర్చలు జరిపారు. పైకి ఎంత ప్రచారం చేసుకున్నా ఈ ప్రాజెక్టుపై చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి సానుకూలత కనిపించడం లేదు. పైగా ప్రాజెక్టు అధ్యయానికి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేదెన్నడు? సీడబ్ల్యూసీ అనుమతులు ఎప్పుడు వస్తాయి? అసలు 152 మీటర్ల వద్ద మహారాష్ట్ర ఒప్పుకొన్నదా? ఈ ఆటంకాలన్నీ అధిగమించి, పనులు ప్రారంభించి, పూర్తయ్యేది ఎన్నడు? ఇలా తమ్మిడిహట్టి చుట్టూ యక్ష ప్రశ్నలు మొదలయ్యాయి.
వాస్తవానికి తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న హడావుడంతా డైవర్షన్ డ్రామానే. ఎల్ నినో ముంచుకొస్తున్నా, కేవలం రాజకీయ కక్షతో కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా కరువును తెలంగాణ ప్రజలపై రుద్దింది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చర్చల పేరుతో డ్రామాలు ఆడుతున్నది.

హైదరాబాద్, అక్టోబర్27 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి లభ్యతలేని ప్రదేశాలు, అనుమతులు రానిచోట ప్రాజెక్టులు.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా ఉమ్మడిరాష్ట్రంలో సమైక్యపాలకులు చేసిన కుట్రలు. దీనికి నిలువెత్తు నిదర్శనం తమ్మిడిహట్టి. ఈ ప్రాజెక్టుది అంతులేని కథ. తీరని వ్యథ. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు.. ఇప్పటికీ కాంగ్రెస్ పాలకుల రాజకీయ విషవలయంలో చిక్కుకొని విలవిలలాడుతున్నది. అదిగో ప్రాజెక్టు.. ఇదిగో గోదావరి జలాలు అంటూ నాడు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు దశాబ్దకాలంపాటు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పాలకులు ఏమార్చారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలకులు మళ్లీ మూడేండ్లుగా ప్రజలను భ్రమల్లోకి నెడుతున్నారు.
ఉమ్మడి పాలకుల కుట్రలను కేసీఆర్ గుర్తించి, వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు ముందుకు సాగదని నిర్ధారణకు రాగానే ప్రత్యామ్నాయాలను అన్వేషించారు. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. అనుమతులను సాధించడంతోపాటు, మూడేండ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ‘కాళేశ్వరం’ను పూర్తి చేశారు. తెలంగాణ ప్రజలకు జల ఫలాలను అందించారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయకక్షతో కాళేశ్వరాన్ని పడావు పెట్టి, తెలంగాణను కరువు కోరల్లోకి నెట్టి, ప్రజలను ఏమార్చేందుకు తమ్మిడిహట్టిపై చర్చలంటూ మళ్లీ డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది.
మహారాష్ట్ర వద్దన్నా.. పాత ప్రతిపాదనలతోనే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు 2007లో పరిపాలన అనుమతులు ఇచ్చింది. వార్ధా, వెయిన్‌గంగా నదులు కలిసిన తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో, 5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బరాజ్‌ను నిర్మించాలని నిర్ణయించింది. బరాజ్ నిర్మాణానికి సంబంధించి ఎత్తుపై పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి అనుమతులు లేకుండా, ఒప్పందాలను చేసుకోకుండానే పనులను ప్రారంభించింది.
ప్రాజెక్టు వ్యయాన్ని రెట్టింపు చేసి, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కాంట్రాక్టర్లర్లకు రూ.వందల కోట్లు దోచిపెట్టింది. నాలుగేండ్లలో పూర్తి చేయాలనే నిబంధనలతో పనులను కట్టబెట్టి, ఆ తర్వాత దానిని ఎనిమిదేండ్లకు రీషెడ్యూల్ చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి సర్వే కాంపోనెంట్స్ కోసం పనుల చెల్లింపు బిల్లులో తొలుత 0.43 నుంచి 0.50శాతం మేరకు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ తరువాత ఆ మొత్తాన్ని ఏకంగా 2నుంచి 3.50శాతానికి సవరించారు. వాస్తవంగా ప్రాజెక్టు వ్యయంలో సర్వే కాంపోనెంట్ల కోసం మొత్తంగా రూ. 172.12కోట్లను చెల్లించాల్సి ఉండగా, దానిని అసాధారణంగా రూ.1211.23కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని నాటి కాంగ్రెస్ పాలకులు చేసిన దోపిడీకి ఇదొక ఉదాహరణ.
అయినా అనుమతులను సాధించిందా అంటే అదీలేదు. ప్రాజెక్టును ప్రారంభించిన ఐదేండ్ల తర్వాత చర్చలు మొదలుపెట్టింది. బరాజ్ ఎత్తు 152 మీటర్లపై అంగీకరించబోమని మహారాష్ట్ర తేల్చిచెప్పింది. అయినా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కీలకమైన బరాజ్ నిర్మాణాన్ని పక్కనపెట్టి, మిగతా పనులను కొనసాగించింది. డబ్బులు దండుకోవడం కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టింది. బరాజ్‌ను నిర్మించకుండానే తొలుత ఈపీసీ విధానంలో కాలువల తవ్వకాన్ని చేపట్టింది.
ఇబ్బడిముబ్బడిగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు వరకు దాదాపు 116కిలోమీటర్ల కాలువను, 75మీటర్ల వెడల్పు, 12మీటర్ల లోతుతో తవ్వాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికే మొత్తంగా 75 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులు పూర్తయ్యాయి. అటు తరువాత కాలువ అలైన్మెంట్ భూమిని సింగరేణి కోల్ ఫీల్డ్ కోసం డిమార్కేషన్ చేసింది. బరాజ్ నిర్మాణం కాకపోవడంతో పూర్తయిన కాలువలు సైతం నిరుపయోగంగా మారాయి.

ఆదిలాబాద్‌కు జీవధారగా ప్రాణహిత కెనాల్
మరోవైపు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన 2లక్షల ఆయకట్టుకూ కేసీఆర్ భరోసా కల్పించారు. అందులో భాగంగా వార్ధాపై బరాజ్‌ను ప్రతిపాదించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని గుండాయిపేట గ్రామం, అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్‌ను నిర్మించాలని నిర్ణయించారు. 653 మీటర్ల పొడవుతో, 12 మీటర్ల ఎత్తుతో, 27గేట్లతో రోడ్ కమ్ బరాజ్‌ను నిర్మించాలని నిర్ణయించింది. తద్వారా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో మొత్తంగా 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి ఏపీలో తవ్విన కాలువలను కూడా అందులో వినియోగించేలా రూపొందించడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం వార్దాపై బరాజ్‌ను నిర్మించి అక్కడి నుంచి దాదాపు 20కిలోమీటర్ల మేర కాలువను తవ్వి తమ్మిడిహట్టి దిగువన కుడిమెట్టిగూడెం వద్ద ఇప్పటికే తవ్విన కాలువతో అనుసంధానించనున్నారు. మొత్తంగా ఆ కాలువనే రిజర్వాయర్‌గా మార్చి 1.5 టీఎంసీలను నిల్వ చేయాలని కేసీఆర్ ప్రణాళికలను రూపొందించారు. వరద కాలువ తరహాలోనే ఆ కెనాల్ సైతం జీవధారగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. డీపీఆర్‌ను సైతం కేంద్రానికి సమర్పించారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ తంటాలు
తెలంగాణకు ఫలితమివ్వని నాటి ప్రణాళికల చుట్టూనే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పరిభ్రమిస్తుండటం గమనార్హం. ‘తమ్మిడిహట్టి వద్ద 152మీటర్లతో బరాజ్ నిర్మించి కేవలం గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లికి 160 టీఎంసీలను మళ్లించవచ్చు. కానీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా లోకేషన్‌ను మార్చారు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించారు. మేం అధికారంలోకి వస్తే తమ్మిడిహట్టి బరాజ్‌ను నిర్మించి నీళ్లిచ్చి తీరుతాం’ అని 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పదే పదే ప్రచారం చేసింది.
అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడచినా చేసిందేమీ లేదు. 160 టీఎంసీలకు బదులుగా 80 టీఎంసీలను, ఎల్లంపల్లికి కాకుండా సుందిళ్లకు తరలిస్తామని మాటమార్చింది. అంతేకాదు 152మీటర్ల నుంచి కనీసం 150మీటర్లకైనా ఒప్పిస్తామని, లేదంటే 149మీటర్లకైనా ఒప్పిస్తామంటూ కొత్తరాగం అందుకున్నది. వాస్తవంగా మహారాష్ట్ర ముందు నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది ముంపుపైనే. వార్ధా, వెయిన్‌గంగా సంగమం తరువాత 1.5కిలోమీటర్ల వద్ద ప్రాణహితపై 152మీటర్లతో తమ్మిడిహట్టి బరాజ్‌ను నిర్మిస్తే మహారాష్ట్రలో 3,725 ఎకరాలు ముంపునకు గురవుతుంది. దాదాపు 14గ్రామాలు ముంపు బారిన పడతాయి. ఆయా అంశాలపై గతంలోనే అనేక సర్వేలు, అధ్యాయనాలు జరిగాయి. కానీ ఎక్కడా మహారాష్ట్ర తగ్గలేదు.
అనుమతులిచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే బరాజ్ ఎత్తును 152మీటర్ల నుంచి 148మీటర్లకు కుదించారు. కానీ కాం గ్రెస్ మాత్రం అవే ప్రతిపాదనలను పట్టుకుని ఇప్పటికీ వెళ్లాడుతున్నది. వాస్తవానికి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేడిగడ్డను వినియోగంలోకి తీసుకురాకుండా కుట్రపూరితంగా పడావు పెట్టింది. బరాజ్‌కు మరమ్మతులు చేయకుండా, వరద ప్రవాహాలు కొనసాగుతున్నా నీటిని ఎత్తిపోయకుండా, తెలంగాణను కరువు కోరల్లోకి నెడుతున్నది. మరోవైపు వార్ధా ప్రాజెక్టును అటకెక్కించి ఆదిలాబాద్‌కు ద్రోహాన్ని తలపెట్టింది. వైఫల్యాలను కప్పించుకునేందుకు తీరా ఇప్పుడు తమ్మిడిహట్టి రాగం అందుకుంటున్నది. మహారాష్ట్రతో చర్చల పేరిట ప్రజల దృష్టిని ఏమార్చుతున్నది.
కుట్రలను ఛేదించి.. సవాళ్లను అధిగమించిన కేసీఆర్
కాంగ్రెస్ మొదటి నుంచి తమ్మిడిహట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉండగా, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దాని వెనుక ఉన్న కుట్రలను అర్థం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహారాష్ట్రతో సంప్రదింపులను ప్రారంభించారు. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి సంబంధించి సాంకేతిక అంశాలపై సర్వేలను చేయించారు. నిపుణులతో అధ్యాయనాలను చేయించారు. ఆయా నివేదికల ఆధారంగా మహారాష్ట్రను ఒప్పించేందుకు తొలుత విశ్వప్రయత్నాలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని మహారాష్ట్ర తేల్చిచెప్పడంతో ఇక ప్రాజెక్టు 152మీటర్లతో ముందుకు సాగదని నిర్ధారణకు వచ్చారు. దీంతో 148మీటర్లతో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారు.
ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి గల సవాళ్లపైనా కూలంకషంగా అధ్యయనం చేశారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల మూలంగా తెలంగాణకు వచ్చిపడిన కొత్త చిక్కులను గుర్తించారు. అదేమంటే బరాజ్ ఎత్తు కుదింపుతో ప్రతిపాదిత 160టీఎంసీల జలాలను మళ్లించుకోలేని దుస్థితి ఏర్పడింది. 150రోజుల పాటు నిరాటంకంగా నీటిని మళ్లించుకున్నా, గరిష్ఠంగా 44టీఎంసీలకు మించి వినియోగించుకోలేని పరిస్థితి. అంటే ప్రాజెక్టు ఆయకట్టుకే దాదాపు 100 టీఎంసీల లోటు ఏర్పడుతుంది. అదీగాక ఇప్పటికే తవ్విన కాలువల ద్వారా నీటిని మళ్లింపు కూడా సవాళ్లతో కూడుకున్నదేనని ఇంజినీర్లు స్పష్టం చేశారు. నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ సైతం పలు అభ్యంతరాలు, సందేహాలను లేవనెత్తింది.
165టీఎంసీల జలాలు కనిపిస్తున్నా, అందులో ఎగువ రాష్ర్టాలు వినియోగించుకోని 63 టీఎంసీలు ఉన్నాయని వెల్లడించింది. భవిష్యత్‌లో ఎగువ రాష్ర్టాలు ప్రాజెక్టులు కట్టి జలాలను వినియోగించుకుంటే నికరంగా అందులో ఉండేది 102 టీఎంసీలేనని తేల్చిచెప్పింది. అలా మహారాష్ట్ర అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ సూచనల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని సీడబ్ల్యూసీ అనుబంధం సంస్థ అయిన వ్యాప్కోస్ను కేసీఆర్ సర్కార్ కోరింది. విశ్రాంత ఇంజినీర్లతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. తుదకు సమస్యలన్నింటికీ పరిష్కారంగా తెలంగాణ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. ప్రాణహిత చేవేళ్లను రెండుగా విభజించింది. ఉమ్మడి ఆదిలాబాద్ కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులను చేపట్టింది.
దశాబ్దాలుగా చర్చల దశల్లోనే..
ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జలాల కోసం ఉప్పెనలా మారుతున్న తెలంగాణ ఉద్యమాన్ని చూసి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. కానీ ప్రాజెక్టును పూర్తిచేయాలనే చిత్తశుద్ధిని ఎక్కడా చూపలేదు. దాదాపు 20 ఏండ్లుగా ఈ ప్రాజెక్టు చర్చల దశలోనే ఉన్నది.
2005 జూన్15
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారీ కోసం జీవో 623ను జారీ చేసింది.
2007 జనవరి
ప్రాజెక్టును నిర్మిస్తామని అసెంబ్లీ వేదికగా అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు.
2007 మే16
రూ.17,875 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి న పరిపాలనా అనుమతులను మంజూరు చేశారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లతో బరాజ్‌ను నిర్మించి, 160 టీఎంసీల జలాలను మళ్లించి 12లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేలా పనులు చేపట్టాలని నిర్ణయించారు.
2008 డిసెంబర్ 17
వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మరోసారి పరిపాలన అనుమతులను సవరించారు. ఆయకట్టును 12 లక్షల నుంచి 16.4 లక్షల ఎకరాలకు పెంచారు.
19 నెలల కాలంలోనే ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 17,875కోట్ల నుంచి 38,500కోట్లకు సవరించారు.
2008 నవంబర్
ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన.
2009
సీడబ్ల్యూసీకి ప్రాజెక్టు ఫిజబులిటీ రిపోర్టు సమర్పణ.
2010
సీడబ్ల్యూసీ నుంచి సూత్రప్రాయ అంగీకారం.
2010 అక్టోబర్
సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పణ. ప్రాజెక్టు వ్యయం రూ.38,500కోట్ల నుంచి రూ.40,300కోట్లకు పెంపు.
2012 మే 5
బరాజ్ ఎత్తు, ముంపు, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి మూడంచెల స్థాయిలో ఒక అంతర్రాష్ట్ర బోర్డును ఏర్పాటు చేయాలని ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రల మధ్య ఒప్పందం.
2013 జనవరి21
హైదరాబాద్ వేదికగా ఇరు రాష్ర్టాల మధ్య కో ఆర్డినేట్ కమిటీ మీటింగ్. 152మీటర్ల ఎత్తుతో మహారాష్ట్రలో భారీగా ముంపు ఉంటుందని ఆ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరం. 148 మీటర్ల వద్ద నిర్మించుకోవాలని సూచన.
2014 మార్చి 24
నాగ్‌పూర్ వేదికగా ఇరురాష్ర్టాల సాంకేతిక నిపుణుల కమిటీ భేటీ. ముంపుపై యథావిధిగా అభ్యంతరం. (నోట్: 2007 నుంచి 2014 వరకు అటు కేంద్రంలో, ఇటు ఉమ్మడి ఏపీలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ అనుమతులను మాత్రం సాధించలేదు. ముంపుపై మహారాష్ట్ర వెనక్కి తగ్గలేదు)
2023 డిసెంబర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మిస్తామని ప్రకటనలు.
2026 సెప్టెంబర్1
మహారాష్ట్ర అధికారులతో ఢిల్లీలో సమావేశం.
2026 సెప్టెంబర్ 26
మహారాష్ట్ర సీఎంతో సమావేశం.
మూడేండ్లలోనే కాళేశ్వరం పూర్తి
తమ్మిడిహట్టి బరాజ్ వద్ద తలెత్తిన సవాళ్లను అధిగమించేందుకు, తెలంగాణ ప్రయోజనాలను దృస్టిలో పెట్టుకుని ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. నీటిలభ్యత ఉండి, అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తని మేడిగడ్డ వద్దకు బరాజ్ నిర్మాణాన్ని మార్చారు. అంతేకాదు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 16టీఎంసీ నిల్వసామర్థ్యమే ఉండగా, దానిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, మేడారం, మలపేట, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండంచెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మకపల్లి రిజర్వాయర్ల విస్తరణ చేపట్టి, నిల్వ సామర్థ్యాన్ని 141టీఎంసీలకు విస్తరించారు. 2016లో ప్రాజెక్టు పనులను ప్రారంభించి, 2019లో ప్రధాన పనులన్నింటినీ పూర్తి చేసింది. పంప్‌హౌస్‌లు, సర్జిపూల్స్, వందల కిలోమీటర్ల కాలువలను పూర్తిచేసింది. అంతేకాదు ప్రాణహిత-చేవెళ్లకు కాంగ్రెస్ సర్కార్ ఒక్క అనుమతి కూడా సాధించకపోగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ సర్కారు అత్యంత స్వల్పకాలంలోనే అన్ని అనుమతులు సాధించింది. సీడబ్ల్యూసీలోని 11 డైరెక్టరీల నుంచి అనుమతులు తీసుకురావడం విశేషం. దేశంలోనే ప్రాజెక్టు వ్యయం రెండింతలు కాకుండా పూర్తయిన ప్రాజెక్టు ఏదయినా ఉందంటే అది కాళేశ్వరమే.
కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు
కొత్త ఆయకట్టు(లక్ష్యం) : 19.63 లక్షల ఎకరాలు
స్థిరీకరణ ఆయకట్టు (లక్ష్యం) : 18.82 లక్షల ఎకరాలు
ఎత్తిపోతల జలాలు : 195 టీఎంసీలు
(ఎల్లంపల్లి 20తో కలిపి 215టీఎంసీలు)
బరాజ్‌ల సంఖ్య : 3
రిజర్వాయర్ల సంఖ్య : 16
సొరంగ మార్గం పొడవు : 203 కి.మీ
మొత్తం నీటి నిల్వ : 141.7
టీఎంసీలు
గ్రావిటి కాలువు : 1531కి.మీ
ప్రెషర్ మెయిన్స్ పైపులు : 98కి.మీ.
సరఫరా వ్యవస్థ నిడివి : 1,832 కి.మీ.
లిఫ్ట్‌ల సంఖ్య : 21
మోటర్ల మొత్తం సామర్థ్యం : 4,627 మెగావాట్లు
ప్యాకేజీలు : 28
లబ్ధిపొందే జిల్లాలు : 13
లబ్ధిపొందే నియోజకవర్గాలు : 31
కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టు
కాళేశ్వరం ద్వారా నేరుగా 98, 570 ఎకరాలు
ప్రాజెక్టు కాలువల ద్వారా నింపిన మైనర్ ఇరిగేషన్
ట్యాంకుల ద్వారా 39, 146 ఎకరాలు
కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీ స్టేజ్-1, 2
నిజాంసాగర్ నీటితో నింపిన 2,143 ఎకరాలు..
చెరువుల ద్వారా 1, 67, 050 ఎకరాలు
మొత్తం- 3,04, 766 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు..
ఆయకట్టు స్థిరీకరణ..
ఎస్సారెస్పీ స్టేజ్-1 (ఎల్ఎండీ),
ఎస్సారెస్పీ స్టేజ్-2, నిజాంసాగర్‌కు
నీరందించి 17, 08, 230 ఎకరాలు
కాళేశ్వరం నీళ్లు కూడవెల్లి వాగు,
హల్దీవాగుల ద్వారా 66 చెక్‌డ్యామ్‌లతో 20,
576 ఎకరాలకు సాగునీరు..
ఇదీ కాళేశ్వరం సమగ్ర స్వరూపం..
3 బరాజ్‌లు
15 రిజర్వాయర్లు
19 సబ్స్టేషన్లు
21 పంప్‌హౌస్‌లు
203 కిలోమీటర్ల సొరంగాలు
531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్
98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్
530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్
240 టీఎంసీల నీటి వినియోగం

P
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

