‘బుర్ర తక్కువ మాటలు సాలు.. ఊకో’!
‘నీ బుర్ర తక్కువ మాటలు సాలు గానీ...ఊకో’... అంటూ ఇందిరమ్మ ఇల్లు అడిగిన ఓ మహిళను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కించపరుస్తూ మాట్లాడిన ఘటన తీవ్రదుమారం రేపింది.
- ఇందిరమ్మ ఇల్లడిగిన మహిళను కించపరిచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
- సిద్దిపేట జిల్లా రేగులపల్లి ‘ఆన్‌వీల్స్’లో నోటి దురుసు
బెజ్జంకి, అక్టోబర్ 27 : ‘నీ బుర్ర తక్కువ మాటలు సాలు గానీ…ఊకో’… అంటూ ఇందిరమ్మ ఇల్లు అడిగిన ఓ మహిళను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కించపరుస్తూ మాట్లాడిన ఘటన తీవ్రదుమారం రేపింది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఆన్‌వీల్స్ కార్యక్రమంలో తన సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన పేద మహిళను ఎమ్మెల్యే హేళన చేసి మాట్లాడటం ప్రచార మాధ్యమాలతోపాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లిలో మంగళవారం జరిగిన ఆన్‌వీల్స్ సమావేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ మహిళ తనకు అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించింది.
దీంతో సహనం కోల్పోయిన కవ్వంపల్లి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మా ఊరికి ఎమ్మెల్యే వచ్చిండు…ఆయనను ఇల్లు అడిగినా అని అందరికీ చెప్పుకోవాలని చూస్తున్నవా… నీ బుర్ర తక్కువ మాటలు వడెయ్య.. సాలు..ఊకో..’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. పేద మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే ఎదురు దాడికి దిగడం ఏంటని, సంక్షేమ పథకాల గురించి అడిగే అర్హత కూడా పేద ప్రజలకు లేదా అని మండిపడుతున్నారు. మహిళ ఆత్మగౌరవంతో జీవించడానికి గూడు కావాలని మొ రపెట్టుకుంటే బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే తీరును ఖండిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

