ఫీజు ఎగవేతకు సర్కార్ కుట్ర!
విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసానివ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. చిన్నచిన్న అక్షరాల్లో తేడాలకే దరఖాస్తులను ‘టెక్నికల్ ఎర్రర్' అంటూ సాఫ్ట్వేర్ తిరస్కరిస్తున్నది. జూలై నుంచి సమస్య వెంటాడుతున్నా.. పరిష్కారానికి ప్రభు త్వం చొరవ చూపడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పథకాన్ని ఎత్తివేసి, రీయింబర్స్మెంట్ బడ్జెట్‌ను తగ్గించుకొనేందుకు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నదని మండిపడుతున్నారు.
- రీయింబర్స్మెంట్ దరఖాస్తులకు సాంకేతిక చిక్కులు.. విద్యార్థుల సతమతం
- గతంతో పోల్చితే 10 శాతం దరఖాస్తులే
- కొన్ని జిల్లాల్లో వంద కూడా దాటలే
- 15 రోజుల్లోనే క్లియర్ కావాల్సి ఉన్నా
- ఇంతవరకు ఒక్క విద్యార్థికీ అందలే
- జూలై నుంచీ పీడిస్తున్న ‘టెక్నికల్ ఎర్రర్’!
- పరిష్కారానికి చొరవ చూపని ప్రభుత్వం
- ఉద్దేశపూర్వక జాప్యమే: విద్యార్థి సంఘాలు
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసానివ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. చిన్నచిన్న అక్షరాల్లో తేడాలకే దరఖాస్తులను ‘టెక్నికల్ ఎర్రర్’ అంటూ సాఫ్ట్వేర్ తిరస్కరిస్తున్నది. జూలై నుంచి సమస్య వెంటాడుతున్నా.. పరిష్కారానికి ప్రభు త్వం చొరవ చూపడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పథకాన్ని ఎత్తివేసి, రీయింబర్స్మెంట్ బడ్జెట్‌ను తగ్గించుకొనేందుకు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నదని మండిపడుతున్నారు.
తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు ఎంత ప్రయత్నించి నా స్వీకరించడం లేదు. ఉదాహరణకు రాజగోపాల్ అనే పేరున్న విద్యార్థి రాజ గోపాల్ అంటూ పూరిస్తే తీసుకోవడం లేదు. ఆధా ర్ కార్డులోని పేరు.. పుట్టిన తేదీ.. ఇంటి పేరు.. పదో తరగతి మె మోలో సరిపోలకపోవడం వంటి సమస్యలతో ప్రక్రియ ముందుకు కదలడం లేదు. అక్షరాల్లో తేడా.. స్పేస్.. ఇంటి పేరు మొదట ఉంటే చివర.. చివర ఉం టే మొదట నమోదు చేస్తే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇదే విషయమై అధికారులను అడిగితే సాఫ్ట్వేర్ అప్డేషన్కు మరో 15 రోజులు పడుతుందని చెబుతున్నారు.
10శాతం కూడా దాటలే..
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆశపెట్టుకుని లక్షలాది మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కానీ ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గతంతో పోల్చితే కేవలం 10శాతం దరఖాస్తులే వచ్చాయి. 2025-26 విద్యా సంవత్సరంలో 10,34,074 దరఖాస్తులొస్తే ఈ ఏడాది కేవలం 1.31 లక్షల దరఖాస్తులే వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కావాలి. కానీ ఇంతవరకు ఒక్క విద్యార్థికి కూడా అందలేదు.
కొన్ని జిల్లాల్లో వందల్లోనే..
ఈ విద్యాసంవత్సరం కొన్ని జిల్లాల్లో పోస్ట్‌మెట్రిక్ రిజిస్ట్రేషన్లు చాలా తక్కువగా వచ్చాయి. కొన్ని జిల్లాల్లో అయితే వంద కూడా దాటలేదు. ములుగులో 166, భూపాలపల్లి జిల్లాలో 352, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 507, నారాయణపేట 527, మహబూబాబాద్‌లో 507, జనగామ జిల్లాలో అయితే 828 చొప్పున దరఖాస్తులొచ్చాయి. ఇక పోస్ట్‌మెట్రిక్ రెన్యూవల్‌కు ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. సాఫ్ట్వేర్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.
2026-27 విద్యాసంవత్సరంలో కొత్త దరఖాస్తులు
సామాజికవర్గం : దరఖాస్తులు
ఎస్సీ : 23,959
ఎస్టీ : 15,371
బీసీ : 65,908
ఈబీసీ : 7,760
డిసేబుల్ : 62
మైనారిటీ : 18,491
మొత్తం : 1,31,551
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

