హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఎల్బీనగర్ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీంతోపాటు అల్వాల్ టిమ్స్‌కు మాజీ సీఎం అంజయ్య, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే సనత్‌నగర్ టిమ్స్‌కు మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది.