హైదరాబాద్, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు సమీపంలోని భోగాపురం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ ఎయిర్పోర్ట్ నుంచి పలు రూట్లలో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంట్లోభాగంగా ఎయిర్ ఇండియాకు చెందిన అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, విజయవాడల నుంచి భోగాపూరం ఎయిర్పోర్ట్నకు రోజు 10 విమాన విమాన సర్వీసులను నడుపబోతున్నట్టు ప్రకటించింది.
దీంట్లో హైదరాబాద్‌లో ఉదయం 7 గంటలకు బయలుదేరనున్న విమాన సర్వీసు భోగాపురానికి 8.20 గంటలకు చేరుకోనుండగా, తిరుగు ప్రయాణంలో ఉదయం 8.50 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు 10 గంటలకు చేరుకోనున్నది. అలాగే బెంగళూరులో మధ్యాహ్నాం 4.50 గంటలకు బయలుదేరనున్న విమాన సర్వీసు రాత్రి 6.30 గంటలకు భోగాపురం చేరుకోనుండగా, అలాగే వైజాగ్-విజయవాడల మధ్య రోజువారీ విమాన సర్వీసు నడుపనున్నట్టు ప్రకటించింది.