హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం వివిధ పథకాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద కాంగ్రెస్ సర్కార్ మొత్తంగా రూ.3,598.4 కోట్ల నిధులు బకాయి పడింది. వాటి విడుదలలో తీవ్రమైన జాప్యం నెలకొనడంతో ఆయా వర్గాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు, వివిధ పథకాల లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
భారీ మొత్తంలో ఉన్న ఆ పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరుతూ ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఇటీవల రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఓ లేఖ రాసింది. రూ.3,598.4 కోట్ల నిధులు విడుదలకు ఆదేశాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కమిషన్ కోరింది. ఒకవైపు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన రూ.2,550 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు, మరోవైపు వివిధ సంక్షేమం, విద్యా పథకాల కింద రూ.1,048.4 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆ లేఖలో పేరొన్నది. పరిశ్రమల శాఖ అమలు చేస్తున్న పథకాల కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన ప్రోత్సాహకాలు ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని కమిషన్ పేరొన్నది.
ఎస్సీలకు సంబంధించిన ప్రత్యేక భాగస్వామ్య ప్రణాళిక (ఎస్సీపీ) కింద రూ.900 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల కాలేదని గుర్తుచేసింది. గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్ పీ) కింద ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన రూ.1,650 కోట్లు ఏటేటా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. ఈ రెండు పథకాల కింద కలిపి రూ.2,550 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల కావాల్సి ఉన్నదని పేరొన్నది. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను నమ్ముకొని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి యూనిట్లు ఏర్పాటు చేశారని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు అందకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతున్నదని తెలిపింది.
వివిధ సంక్షేమం, విద్యా పథకాల కింద కూడా భారీ మొత్తంలో నిధులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చైర్మన్, సభ్యులు నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు, బాధితులు, విద్యార్థులు, లబ్ధిదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయని పేరొన్నది. కమిషన్ గుర్తించిన బకాయిల్లో పోస్ట్‌మెట్రిక్ సాలర్షిప్లకు రూ.829.40 కోట్లు, ప్రీ మెట్రిక్ సాలర్షిప్లకు రూ.14.34 కోట్లు ఉన్నాయని తెలిపింది.
విద్యార్థుల సాలర్షిప్లకే మొత్తం రూ.843.74 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు సీఎంకు రాసిన లేఖలో కమిషన్ వివరించింది. ఎస్సీ, ఎస్టీ బాధితులకు అందించాల్సిన ద్రవ్య సహాయం కింద రూ.31.52 కోట్లు, బెస్ట్ అవైలబుల్ సూల్స్ (బీఏఎస్) పథకం కింద రూ.102.81 కోట్లు, హైదరాబాద్ పబ్లిక్ సూల్ (హెచ్‌పీఎస్) కింద రూ.14.08 కోట్లు, కులాంతర వివాహ ప్రోత్సాహకాల కింద రూ.56.25 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని కమిషన్ తెలిపింది. ఈ మొత్తం బకాయిలు రూ.1,048.4 కోట్లుగా ఉన్నట్టు పేరొన్నది.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను వేరు చేసి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్‌గా వేర్వేరుగా ఏర్పాటుచేసే ప్రతిపాదనను సమగ్రంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కమిషన్ చైర్మన్ కోరారు. కమిషన్‌ను రెండు ప్రత్యేక సంస్థలుగా విభజించడం వల్ల కలిగే సాధ్యమైన ప్రతికూల పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీలు ఎదురొంటున్న అనేక సమస్యలు పరస్పరం ఉమ్మడిగా ఉన్నాయని తెలిపారు.
అఘాయిత్యాలు, వివక్ష, వేధింపులు, హకుల నిరాకరణ, సామాజిక న్యాయం వంటి అంశాలకు పౌరహకుల పరిరక్షణ చట్టం-1955, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం-1989 ఉమ్మడి చట్టపరమైన వ్యవస్థను అందిస్తున్నాయని పేరొన్నారు. ఎస్సీ వర్గాల్లోని మాల, మాదిగలకు సంబంధించిన అంశాలతోపాటు, గిరిజన వర్గాల్లోని వివిధ తెగల సమస్యలు, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో ఆదివాసీలు, లంబాడీలకు సంబంధించిన కొన్ని సమస్యలు సామాజిక, ఆర్థిక, పరిపాలన, అభివృద్ధి అంశాలతో ముడిపడి ఉన్నాయని పేరొన్నారు. వీటిని సమగ్రంగా పరిశీలించి తగిన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సంక్షేమం, రక్షణ, విద్య, ఉపాధి, భూమి, జీవనోపాధి వంటి అంశాలు పలు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకునే అంశాలని తెలిపారు.