హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) ఏర్పాటు ప్రక్రియను సర్కార్ ప్రారంభించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ స్కూల్‌ను నెలకొల్పనున్నది.
రూ. 16.62 కోట్ల అంచనా వ్యయంతో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు గల ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నది. 2026- 27 విద్యాసంవత్సరంలో ఈ స్కూల్ ప్రారంభమవుతుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.