హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు డీఈవోలను ప్రభుత్వం నియమించింది. కొందరిని బదిలీ చేయడంతోపాటు డీఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం డీఈవో వాసంతిని బదిలీ చేసి, ఖమ్మం జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
కొత్తగూడెం డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శంభుప్రసాద్‌ను భద్రాద్రి జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. కరీంనగర్ జిల్లా డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్ ప్రశాంత్‌రెడ్డిని వరంగల్ డీఈవోగా, నిర్మల్ డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్ శ్రీనివాసరావును సూర్యాపేట డీఈవోగా నియమించింది.