చావా, ధురంధర్ చిత్రాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. ఈ సినిమా అపూర్వ విజయంతో ఆయనకు భారీ ఆఫర్లొస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని ప్రముఖులు నివసించే మలబార్ హిల్స్‌లో అక్షయ్ఖన్నా దాదాపు 40కోట్ల వ్యయంతో భారీ బంగళాను ఖరీదు చేసినట్లు తెలిసింది. మూడువేలకుపైగా చదరపు ఫీట్ల వైశాల్యం కలిగిన ఈ బంగళాను ఆధునిక వసతులతో తీర్చిదిద్దిన్నట్లు తెలిసింది.
‘ధురంధర్’ సక్సెస్‌తో భవిష్యత్తు చిత్రాల పట్ల అక్షయ్ఖన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్త పడుతున్నాడని ముంబయి సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో అక్షయ్ఖన్నా కొత్త విల్లా కొనుగోలు ముంబయి ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.