ముంబై: బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె మామ, సినీ నిర్మాత వషు భగ్నానీకి చెందిన ముంబైలోని ఆఫీసుల్లో, పనోరమా స్టూడియోలో ముంబై ఆదాయ పన్ను విభాగం సోమవారం సోదాలు నిర్వహించింది. అనుమానిత నిధుల అవకతవకలకు సంబంధించి 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
సినిమా ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టే నెపంతో నిధులను విదేశాలకు తరలించి ఉంటారని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు పత్రాలను, ఆర్థిక రికార్డులను, విదేశాల్లో జరిగాయని ఆరోపణలున్న లావాదేవీలను వారు పరిశీలిస్తున్నారు.