హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖకు ఆ యుధాలు ఇవ్వడానికి అనుమతి ఇస్తే ఏ స్థాయి అధికారులకు ఇవ్వాలనే విషయంపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ చర్చించారు. ఆయుధాలు ఇస్తే పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందని అదేశించారు. సోమవారం క్యూర్ పరిధిలోని ఎైక్సెజ్ అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌శాఖ ఎన్డీపీఎస్ (డ్రగ్స్), ఎన్ డీపీఎస్ (నాన్ డ్యూటీ పెయిడ్ లికర్)పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఆదేశించారు.
బార్స్, వైన్స్‌లకు సంబంధించిన ఎక్సైజ్ రెంటల్ ఫీజును త్వరితగతిన వసూలు చేయాలని సూచించారు. కొత్త బార్ల కోసం దరఖాస్తులు చేసుకునే వారికి సౌకర్యాలు కల్పించాలని, దరఖాస్తుదారులకు ఎక్సైజ్ అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాషిన్ ఖురేషీ, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ జీ అంజన్‌రావు, డిప్యూటీ కమిషనర్లు ఏ శ్రీనివాసరెడ్డి, జే హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.