హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) సభ్యత్వ నమోదు ప్రారంభమయ్యింది. నాంపల్లి ఎక్సైజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ ఈ సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
ఎక్సైజ్ అధికారులందరిని సమావేశ పరిచి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, సురేశ్ రాథోడ్, ఎంబీ కృష్ణాయాదవ్, టీ లక్ష్మణ్‌గౌడ్, డాక్టర్ హరికృష్ణ, ఎంపీఆర్ చంద్రశేఖర్, శ్రావణ్‌కుమార్, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.