పెన్‌పహాడ్, ఆగస్టు 07 : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు రంగినేని శారద, ములుకుంట్ల భారతి, భూక్య జ్యోతి విస్తృతంగా పర్యటించారు. మొదటగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మండల వైద్యాధికారి డాక్టర్ రాజేశ్‌తో కలిసి ఓపి, ఆపరేషన్ గది. మందుల గది. రోగుల గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీ ఆవరణలోమొక్కలు నాటారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్వాడీ 3 సెంటర్. అంగన్వాడీ 1 సెంటర్‌ను పరిశీలించారు. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులలు ఎందుకు లేవు అని అడుగగా మూటగట్టి అటకెక్కించిన ఆట వస్తువులను తీసి చిన్నారుల ముందు కుప్పలుగా పోయడంతో అంగన్వాడీ టీచర్లపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొమ్మలు చూపించి చిన్నారులను ఇవి ఏ బొమ్మలు అని అడుగగా చిన్నారులు చెప్పకపోవడం, ఆటపాటల్లో చురుకుగా లేకపోవడంతో చిన్నారులకు ప్రతిరోజు మీరు ఏం చెప్తున్నారని ప్రశ్నించారు. చిన్నారులపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం. గుడ్లను పెట్టాలన్నారు. అనంతారం జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఎం మల్లారెడ్డితో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివి, ట్రైనింగ్ పొంది ఉన్న నేపథ్యంలో పిల్లలకు నాణ్యమైన బోధనను అందించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అశోక్, డీఆర్డీఏ అప్పారావు, జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రసాద్, జిల్లా హౌసింగ్ బోర్డ్ అధికారి మోహన్ రావు, డీటీఓ శంకర్రావు, డీడబ్ల్యూఓ దయానందరాణి, ఐ ఎన్ పి ఆర్ మల్లేశ్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఎల్.శ్రీనివాస్. ఐసీడీఎస్ సీడీపీఓ కిరణ్మయి, ఎంఈఓ డాక్టర్ రాజేశ్. ఎంఈఓ ఎన్. రవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయ్, చంద్రిక. ఉపేంద్ర, అనిశా, స్వప్న, సునీత, అంగన్వాడీ టీచర్లు విజయ, ఊర్మిళ పాల్గొన్నారు.
Penpahad : పెన్‌పహాడ్ మండలంలో తెలంగాణ ఫుడ్ కమిషన్ విస్తృత పర్యటన