హైదరాబాద్ : కృష్ణా జలాల నుంచి అదనంగా 45 టీఎంసీల వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేఆర్ఎంబీ చైర్మన్‌ను తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కోరారు. గురువారం ఆయన కేఆర్ఎంబీ చైర్మన్‌కు మూడు లేఖలు రాశారు. పోలవరం ద్వారా 80 టీఎంసీలు తరలిస్తున్నారన్న ఆయన.. రాష్ట్రానికి అదనంగా కృష్ణాజలాలు ఇవ్వాలన్నారు. సాగర్ ఎడమ కాలువల పథకాలపై ఏపీకి అభ్యంతరాలు అక్కర్లేదన్నారు.
ప్రతిపాదించిన 13 ఎత్తిపోతలపై అభ్యంతరాలు అవసరం లేదని ఈఎన్సీ స్పష్టం చేశారు. రూ.47వేలకోట్లతో కృష్ణానదిపై ఏపీ ప్రాజెక్టులు చేపట్టిందని, ఆ కొత్త ప్రాజెక్టులు, విస్తరణ పనులు ఆపాలని కోరారు. శ్రీశైలం నుంచి ఏపీకి 34 టీఎంసీలకు మించి వాడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, ఔట్లెట్ల వద్ద సెన్సార్లు బిగించి, సెన్సార్లతో నీటిని వినియోగం పూర్తిగా లెక్కించాలన్నారు. వాటా వాడేలా రాజోలిబండ మళ్లింపు పనులు జరుగాలన్నారు.