హైదరాబాద్, సిటీబ్యూరో, మే19 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం మెటీరియల్, లేబర్కాస్ట్ పెరగటం మూలంగా పనులు చేయలేకపోతున్నట్టు తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం ప్రభుత్వశాఖల్లోని ఎలక్ట్రిక్, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ఎర్రమంజిల్ ఆర్అండ్బీ భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ వై లింగారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ రేట్లపై ఆర్అండ్బీ అధికారులు దృష్టిసారించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. సకాలంలో బిల్లులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఎస్ఆర్ రేట్లు అన్ని డిపార్ట్మెంట్ల్లో ఒకే విధానం ఉండేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ ఇన్ బోర్డ్ మాజీ మెంబర్ సదానంద్గౌడ్, మాజీ మెంబర్ నక్క యాదగిరి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుజయ్కుమార్, శ్రీనునాయక్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.