హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఎనిమిదో వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం ఆన్లైన్లో నిర్వహించారు. ఏడో సర్వసభ్య సమావేశ వివరాలు, 2020-21 ఆర్థిక సంవత్సర రాబడి, ఖర్చుల పట్టికను ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీతారెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు జూలూరి సంతోష్‌కుమార్, నంగునూరి వెంకటరమణ, సొసైటీ జీవితకాల సభ్యులు శివనాథుల సత్యనారాయణ ఆమోదించారు. సభ్యులు ముద్దం విజ్జేందర్, ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి సమాధానాలు ఇచ్చారు. జూమ్ యాప్‌లో జరిగిన ఈ సమావేశానికి సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్ బాబు మోడరేటర్‌గా వ్యవహరించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన సౌందరిపల్లి మనోహరకృష్ణ, కైలాసపు కిరణ్‌లకు కృతజ్ఞతలు తెలిపి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కిరణ్‌కుమార్ ఎబ్రోయిన, శివారెడ్డి అద్దులను ఆడిటర్లుగా ఎన్నుకొన్నారు. సభ్యులు ఇచ్చిన సలహాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.