హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీపీగెట్ ఎంఈడీ, ఎంపీఈడీ అడ్మిషన్ షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. 12 వ తేదీన దరఖాస్తుల్లో తప్పులు సవరించుకోవచ్చని సూచించారు. 14వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చేపడతారు. 16న ప్రాథమికంగా సీట్లు కేటాయిస్తూ జాబితాలు ప్రదర్శిస్తారు.
హైదరాబాద్, నవంబర్6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ) చైర్మన్‌గా డాక్టర్ రామలక్ష్మణ్ మరోసారి ఎన్నికయ్యారు.