కదలని రెవెన్యూ ఫైళ్లు!
రెవెన్యూ కార్యాలయంలో ఒక ఫైలు కదలటానికి ఎన్ని రోజులు పడుతుంది? క్షేత్రస్థాయి విచారణ పూర్తయి, అధికారులు నివేదిక సమర్పించిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోకపోతే, భూమి తనదేనని నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలన్నీ సమర్పించినా, రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తే బాధితుడు ఇంకెవరిని ఆశ్రయించాలి?
- భూ యజమానులకు గుదిబండగా భూ భారతి
- కలెక్టరేట్లలో పేరుకుపోతున్న దరఖాస్తులు.. క్షేత్రస్థాయి నివేదికలొచ్చినా కదలని ఫైళ్లు
- మంచిర్యాల జిల్లాలో దాదాపు 3 వేలు పెండింగ్
- సంగారెడ్డిలో 2,993 రిఫండ్ దరఖాస్తులు పెండింగ్
హైదరాబాద్, అక్టోబర్21 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ కార్యాలయంలో ఒక ఫైలు కదలటానికి ఎన్ని రోజులు పడుతుంది? క్షేత్రస్థాయి విచారణ పూర్తయి, అధికారులు నివేదిక సమర్పించిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోకపోతే, భూమి తనదేనని నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలన్నీ సమర్పించినా, రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తే బాధితుడు ఇంకెవరిని ఆశ్రయించాలి? ప్రస్తుతం రాష్ట్రంలోని రెవెన్యూ ఫైళ్ల పరిస్థితి ఇదే. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లలో నిర్ణయాలు జాప్యం చేస్తున్నారని, భూ సంబంధిత దరఖాస్తులు వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పని పూర్తయినా ఉన్నతాధికారులే పైళ్లను తొకిపెట్టడంపై బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నివేదిక పూర్తయినా ముందుకు కదలదా?
సంగారెడ్డి జిల్లాలో 1,100 ఎకరాల దళిత, బహుజన అసైన్డ్ భూములను అడ్డగోలుగా పెద్దలకు కట్టబెట్టేందుకు కలెక్టర్ చకచకా సంతకాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒక మహిళకు వారసత్వంగా వచ్చిన ఒక ఎకరం పట్టాభూమిని మ్యుటేషన్ చేయడానికి మాత్రం నెలలు గడుస్తున్నా, సమయం దొరకడం లేదట. కంది మండలంలో ఉన్న భూమికి క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ పూర్తయి సంబంధిత అధికారులు స్పష్టమైన నివేదిక సమర్పించినా, ఆ ఫైలు గత నెల రోజులుగా కలెక్టర్ టేబుల్‌పైనే మూలుగుతున్నదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తుది నిర్ణయం తీసుకోవడంలో ఇంతటి తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతున్నదో అధికారులు చెప్పడం లేదని ఆమె వాపోతున్నారు.
వాస్తవానికి దరఖాస్తులో ఏమైనా చట్టపరమైన సమస్యలు, అభ్యంతరాలు ఉన్నాయా లేక మరేవైనా అదనపు పత్రాలు అవసరమా అన్న విషయాన్ని దరఖాస్తుదారుకు తెలపాలి. ఫైలును తిరసరించాల్సి వస్తే కారణాలు వెల్లడించాలి. అంతేగానీ నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా తొకిపెట్టడం వల్ల సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తున్నదని బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భూ మ్యుటేషన్ అనేది కేవలం రికార్డుల్లో పేరు మార్చడం మాత్రమే కాకుండా, వారసత్వ భూమిపై హకులను నిలబెట్టుకోవడానికి, భవిష్యత్ లావాదేవీల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి అత్యంత కీలకం. కాబట్టి ఈ దరఖాస్తు ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది, ఫైలు ఏ అధికారి వద్ద ఆగిపోయింది? తుది నిర్ణయానికి అడ్డంకి ఏమిటి? అనే వివరాలు తక్షణమే వెలుగులోకి రావాల్సి ఉన్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది ఒక సంగారెడ్డి జిల్లాకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా వేలాది దరఖాస్తులు ఇలా కలెక్టరేట్లలో మగ్గుతున్నాయని చెప్తున్నారు.
మంచిర్యాలలో 3 వేల దరఖాస్తులు
భూ సంబంధిత సమస్యలు ఒక జిల్లాకే పరిమితం కాలేదని మంచిర్యాల జిల్లా గణాంకాలు సూచిస్తున్నాయి. భూ భారతి పోర్టల్‌లో మంచిర్యాల జిల్లాకు సంబంధించి దాదాపు 3 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2026 సెప్టెంబర్ 21 నాటికి తహసీల్దార్ల స్థాయిలో 1,258 దరఖాస్తులు, రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయిలో 1,214 దరఖాస్తులు, కలెక్టర్ స్థాయిలో 318 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందుకు కారణాలు ఏవైనా.. పై నుంచి ఫోన్లు వస్తేనే పని చేస్తున్నారని, లేకుంటే వదిలేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
మహిళ భూమి వివాదంలో..
భూ పరిపాలనలో జాప్యం, నిబంధనల అమలు విషయంలో అధికారుల బాధ్యతను గుర్తుచేసే మరో కీలక పరిణామం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వారసత్వంగా వచ్చిన 2.22 గుంటల భూమిపై హకుల కోసం పోరాడిన నల్లవెల్లి లక్ష్మి కేసులో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు తెలంగాణ హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే తదుపరి న్యాయపరమైన పరిషారాన్ని పొందేందుకు వీలుగా శిక్షను నాలుగు వారాలపాటు నిలిపివేసింది.
26,740 రిజిస్ట్రేషన్ స్లాట్ ఫైళ్లు పెండింగ్
మరోవైపు భూమి రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దు చేసుకున్నవారికి చెల్లించాల్సిన ఫీజు రిఫండ్లలోనూ తీవ్రమైన అలసత్వం నెలకొన్నది. అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 31,314 రిఫండ్ దరఖాస్తులకు గాను ఏకంగా 26,740 పెండింగ్‌లో ఉన్నాయి. తిరిగి చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 87.60 కోట్లకు చేరింది. జిల్లాలవారీగా పరిశీలిస్తే రంగారెడ్డిలో అత్యధికంగా 3,961 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా కలెక్టర్ స్థాయిలో ప్రాసెస్ అయినవి కేవలం మూడే కావడం గమనార్హం. అలాగే సంగారెడ్డి జిల్లాలో 2,993, నల్లగొండలో 1,950, వికారాబాద్‌లో 1,839 దరఖాస్తులు నిలిచిపోయాయి. కలెక్టర్లు సిఫార్సులు పంపినా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కావడం లేదని కొందరు అధికారులు చెప్తున్నారు. అయితే.. శాఖల మధ్య సమన్వయ లోపం సామాన్య పౌరుడికి శాపంగా మారుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

