కాటన్ అసోసియేషన్‌లో వసూళ్ల దందా!
జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్‌లో భారీగా వసూళ్ల దందా జరుగుతున్నట్టు తెలిసింది. ఓ ఇద్దరు నేతలు అంతాతామై కీలకంగా వ్యవహరిస్తూ.. ప్రతి మిల్లుకూ టార్గెట్ పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, మార్కెటింగ్, సీసీఐ అధికారులకు ముట్టజెప్పాలని బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ ఇవ్వకపోతే రైస్ మిల్లుల తరహా తనిఖీలు, కేసులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
- ప్రతి మిల్లు నుంచి వసూళ్లు
- మంత్రులు, అధికారులకు ముట్టజెప్పాలని.. లేకపోతే తనిఖీలు తప్పవని హెచ్చరిక
- 15-20 కోట్ల వరకు వసూలు
- అసోసియేషన్‌లోని ఓ కీలక నేత వద్ద 10కోట్లు .. మరో కీలక నేత వద్ద 5 కోట్లు జమ
- అసోసియేషన్ భవన నిర్మాణాల పేరిట అదనపు వసూళ్లు
- వసూళ్లపై మండిపడుతున్న మిల్లుల యాజమాన్యాలు
హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్‌లో భారీగా వసూళ్ల దందా జరుగుతున్నట్టు తెలిసింది. ఓ ఇద్దరు నేతలు అంతాతామై కీలకంగా వ్యవహరిస్తూ.. ప్రతి మిల్లుకూ టార్గెట్ పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, మార్కెటింగ్, సీసీఐ అధికారులకు ముట్టజెప్పాలని బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ ఇవ్వకపోతే రైస్ మిల్లుల తరహా తనిఖీలు, కేసులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. వీరి బెదిరింపులకు తాళలేక కొన్ని మిల్లుల యాజమాన్యాలు సదరు వ్యక్తులు అడిగినంత సమర్పించుకుంటే.. కొందరు మాత్రం ఈ వసూళ్ల దందాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆగ్రహిస్తున్నారని ప్రచారం జరుగుతన్నది. తాము ఎందుకు ఎందుకివ్వాలని, వసూలు చేసిన సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నదంటూ నిలదీస్తున్నట్టు తెలిసింది.
బేల్‌కు రూ.50 చొప్పన రూ.కోట్లల్లో వసూలు!
వసూళ్ల దందాలో ఆ ఇద్దరు కీలక నేతలు పక్కా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిసింది. నిరుడు రాష్ట్రంలోని 336 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఇందులో సుమారు 30 లక్షల బేళ్ల పత్తి కొనుగోలు చేసింది. దీని ఆధారంగా మిల్లులకు టార్గెట్ పెట్టినట్టు తెలిసింది. ఏ మిల్లులో ఎంత కొనుగోలు జరిగిందో ఆ లెక్కన చెల్లించాలని చెప్పినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఒక్కో బేల్కి రూ.50 చొప్పున వసూళ్ల టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఈ లెక్కన అన్ని మిల్లుల నుంచి రూ.15 కోట్లు వసూలు చేసినట్టు జిన్నింగ్ మిల్లు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే కొన్ని మిల్లుల నుంచి ఎక్కువగా వసూలు చేశారని తెలిసింది. ఒక్క సీజన్లోనే సుమారు రూ.20 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదేగాక అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణాలను సాకుగా చూపుతున్నట్టు అదనపు వసూళ్లు చేశారని తెలిసింది.
పంచడానికా? జేబులోకా?
వసూలు చేసిన సొమ్మంతా ఇద్దరి వద్దే ఉన్నట్టు తెలిసింది. ఒకరి వద్ద రూ.10 కోట్లు, మరొకరి వద్ద రూ.5 కోట్లు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్, విజిలెన్స్ భారీగా దాడులు చేస్తున్నాయి. ధాన్యం నిల్వల్లో తేడాలు, సీఎమ్మాఆర్ బకాయిలపై కొరడా ఝులిపిస్తున్నారు. వాటి యాజమాన్యాలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఈ పరిణామాలను జిన్నింగ్ మిల్స్‌లోని ఆ ఇద్దరు తమకు అనుకూలంగా మార్చుకొన్నారనే విమర్శలున్నాయి.
అందుకు మిల్లర్లలో భయపడేలా చేసి.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, తనిఖీలు జరుగకూడదన్నా ఏదో ఒకటి చేయాల్సిందేనని తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఇందుకోసం ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, సీసీఐ అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పాల్సి ఉంటుందని చెప్తున్నట్టు చర్చ జరుగుతున్నది. అయితే ఈ వసూళ్లన్నీ పెద్దలకు ఇవ్వడానికా? లేక ఆ ఇద్దరి జేబుల్లో వేసుకోవడానికా? అని మిల్లర్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. కాగా మిల్లుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనేది అంతా తప్పుడు ప్రచారమని రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేశ్ తెలిపారు. అసోసియేషన్‌లోని వ్యతిరేక వర్గం ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నదని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

