పాలమూరు ఆఫ్.. ముచ్చుమర్రి ఆన్
సాగు నీటి వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సోయి తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌కు లేకుండా పోయిందని ఇక్కడి రైతులు, సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటానూ ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాలమూరు ఎత్తిపోతల పథకం పంపులు నడిపిన విధానమే ఇందుకు నిదర్శనమని వారంటున్నారు.
- ఆన్, ఆఫ్‌ల మధ్య 14 నుంచి 19 వరకు కొనసాగిన పీఆర్ఎల్ఐ పంపింగ్
- నార్లాపూర్ పూర్తి సామర్థ్యానికి చేరుకోకముందే పంపులు ఆఫ్ చేయడంపై అన్నదాతల ఆగ్రహం
కొల్లాపూర్, అక్టోబర్ 21 : సాగు నీటి వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సోయి తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌కు లేకుండా పోయిందని ఇక్కడి రైతులు, సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటానూ ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాలమూరు ఎత్తిపోతల పథకం పంపులు నడిపిన విధానమే ఇందుకు నిదర్శనమని వారంటున్నారు. శ్రీశైలం జలాశయంలో నీళ్లు పుష్కలంగా ఉన్నా వినియోగించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేసిన ఒత్తిడి ఫలితంగా ఈ నెల 14 ఆన్ చేసిన పాలమూరు పంపులను 19వ తేదీ వరకు నడిపించి మమ అనిపించారు.
ఇక్కడ పాలమూరు పంపులు బంద్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలోని పంపులు ఆన్ కావడంతో తెలంగాణలో సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మూడేండ్లు పాలమూరు పంపులను ఆన్ చేయకుండా కృష్ణా జలాలపై తెలంగాణకు ఉన్న వాటాను ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ ఒత్తిడితో ఆన్ చేసిన పంపులను కూడా నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరుకోకముందే ఆఫ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీళ్ల కోసం పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్న తెలంగాణ వాదులు సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. మూడేండ్లు పనులను నత్తనడకన నడిపించి ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకొన్న మంత్రి జూపల్లి ‘నమస్తే తెలంగాణ’పై మండిపడటం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.
పాలమూరును కరువు నుంచి రక్షించేందుకు శ్రీశైలం జలాశయంలోని డెడ్ స్టోరేజీ పాయింట్ అయిన కోతిగుండు నుంచి సాగునీరు తీసుకునేలా రూపొందించిన పీఆర్‌ఎల్‌ఐని 2023 సెప్టెంబర్ 16న అప్పటి సీఎం కేసీఆర్ ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి రెండున్నర టీఎంసీలకుపైగా కృష్ణా జలాలను ఎత్తిపోసి జాతికి అంకితమిచ్చారు. నాటి నుంచి మూడేండ్లపాటు పాలమూరు మోటర్లు మోగలేదు. బీఆర్ఎస్ పార్టీ అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెట్టడంతోపాటు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్‌ను సందర్శించి పాలమూరు మోటర్లను ఆన్ చేయకపోతే తామే రైతులతో కలిసి ప్రారంభిస్తామని అల్టిమేటమ్ జారీ చేశారు. దీంతో ఈ నెల 14న మోటర్లను ఆన్ చేసి ఐదున్నర గంటలకే ఆఫ్ చేశారు. మళ్లీ అదే రాత్రి మోటర్లను ఆన్ చేశారు. 19వ తేదీ వరకు పాలమూరు మోటర్లు ఆన్, ఆఫ్‌ల మధ్యనే నడిచాయి. అయినా రెండు పంపులు నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి రాక ముందే బంద్ అయ్యాయి.
ఏపీలోని ముచ్చుమర్రి ఆన్..
పాలమూరు పంపులు ఆఫ్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి అనుబంధంగా ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలోని పంపులు ఆన్ అయినట్టు తెలుస్తున్నది. బుధవారం ఈ పంపుల ద్వారా 4,850 క్యూసెక్కుల జలాలను ఎత్తిపోస్తున్నట్టు సమాచారం. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం కంటే పీఆర్ఎల్ఐ లోతట్టులో ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

