BC Fedaration | మారేడ్‌పల్లి, మే 20: 17 బీసీ కులాలను ఎంబీసీలుగా గుర్తించి వారి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి న్యాయం చేయాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్లెలాపు దుర్గారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుక్కల శ్రీకాంత్ ప్రభుత్వాన్ని కోరారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దీనిపై వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం బీసీ కులాల రాష్ట్ర స్థాయి సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం కమ్మరి మోహన్ చావన్ ( రాష్ట్ర అధ్యక్షులు) ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బెల్లాపు దుర్గారావు ( బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ), అధికార ప్రతినిధిభాస్కరుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చుక్కల శ్రీకాంత్ హాజరై ప్రసంగించారు.
17 బీసీ కులాలను ఎంబీసీలుగా గుర్తించి వారి విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ అభివృద్ధికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని త్వరలో కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ 17 కులాల నుంచి ఓబీసీ జాబితాలో చేర్చేలా ఢిల్లీలో బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహిర్‌ను స్వయంగా కలిసిన విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సరైన గుర్తింపు లేని ఈ వర్గాలకు న్యాయం జరిగేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో వీటికి సంబంధించిన కార్యాచరణను త్వరలో ప్రారంభిస్తామని సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గుర్తింపు పొందిన ఈ 17 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.