హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టారెంట్లపై కొత్తగా ‘ప్రివిలేజ్ సెస్’ విధించాలన్న సర్కార్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బార్లను మూసివేశారు. యజమానులు నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌ను ముట్టడించారు. ప్రివిలేజ్ సెస్ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.