హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): చేప పిల్లల పంపిణీకి సంబంధించిన బిల్లుల చెల్లింపు వ్యవహారంలో దాఖలైన కోర్టు ధికరణ పిటిషన్లో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి కే ఇలంబర్తి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, మత్స్యశాఖ డైరెక్టర్ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ప్రభుత్వానికి సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించిన రూ.37.18 లక్షల బిల్లుల నిమిత్తం నాగేంద్రకుమార్ దత్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ టీ మాధవీదేవి బిల్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.