హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోల ఫోరం) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీవో భవన్లో సోమవారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.
మైన్స్ అండ్ జియాలజీ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కే లక్ష్మీనరసింహారావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా జీ సంజయ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా ఆర్ రవీందర్, పీ శ్రీనివాస్, టీ రేణుక, సంయుక్త కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు, కే నాగరాజు, ఆర్ సుజాత, కోశాధికారిగా కే లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కే ప్రతాప్‌రెడ్డి, ఎన్ రమేష్, జే మధుసూదన్, ఈసీ సభ్యులుగా ఎం నాగలక్ష్మి, సారంగపాణి, కే సరితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.