దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తూ పరిశ్రమలను నెలకొల్పేందుకు సహకరిస్తుందని ఎలక్ట్రానిక్స్ టి ఫైబర్, టీ వర్క్స్ డైరెక్టర్, సీఈవో సుజయ్ కారంపూడి పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్ పో ఇన్ ఇండియా 2021 కార్యక్రమాన్ని శనివారం తెలంగాణ రాష్ట్రం రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడ్కో జనరల్ మేనేజర్ ప్రసాద్, రాజీవ్ అరోరా, అనేజ్ శర్మ, ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణ, ఎంజే పురహిత్తో పాటు కార్యక్రమానికి చెందిన నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సీతారాంపూర్‌లో 200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్థలాన్ని గుర్తించి 2, 3 నెలల్లో కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి 200 ఎకరాల స్థలాన్ని ఎలక్ట్రిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని దివిటీపల్లిలో ఎనర్జీ స్టోరేజీ పార్క్‌ను ప్రారంభానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. లిథియం అయాన్ సెల్, బ్యాటరీ తయారీ, సోలార్ సెల్, మాడ్యూల్ అసెంబ్లీతో పాటు ఇతర నూతన పునరుత్పాదక ఇంధన సంబంధిత తయారీని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ఈవీ తయారీల స్థావరాలుగా మార్చుకోవాలని పరిశ్రమ నేతలను కోరారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రోతహకాలను అందజేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ఆటోలు, ప్రైవేట్ కార్లు, క్యాబ్‌లు, బస్సులు, ట్రాక్టర్లు వంటి ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి వర్తించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు రవాణా భవిష్యత్ అని, తెలంగాణను 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాల రాష్ట్రంగా చూడాలన్నది కల అన్ని అన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులూ వాడుతున్నారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 34 మెగావాట్ల సౌరశక్తి తయారీ సామర్థ్యం ఉండేదని, ప్రస్తుతం 3900 మెగా వాట్ల సామార్థ్యానికి విస్తరించిందని టీఎస్ రెడ్కో జనరల్ మేనేజర్ ప్రసాద్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని, కొనుగోలుదారులకు సబ్సిడీని అందజేస్తు వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లు తెలంగాణలో అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 9 వేల వాహనాలు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రూ. 36 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి వాడుతున్నారని చెప్పారు.
ఫ్రాంక్లిన్ ఈవీ …