కొండాపూర్, నవంబర్ 23 : ఫార్మారంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ వాటర్ రీసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీ.ప్రకాశ్ రావు అన్నారు. మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో మంగళవారం నిర్వహించిన ‘క్వాలిటీ అండ్ ది కన్జూమర్’ సమ్మిట్‌కు హాజరైన ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం ఇటీవలే ముచ్చింతల్‌లో ఫార్మా హబ్‌ను ప్రారంభించిందని, నాణ్యతతో కూడిన మెడిసిన్స్‌ను ఉత్పత్తి చేసేందుకు ఫార్మా సంస్థలు ముందుకు రావాలన్నారు.
అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని సొంతం చేసుకుందన్నారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదటి డ్రగ్ కంట్రోలర్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ సీ గోపాలక్రిష్ణమూర్తికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి, కన్జూమర్ ఆన్లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ బెజాన్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు.