
అలసందలు సాగు చేస్తే అధిక లాభాలు ఉంటాయని మా బంధువులు అంటున్నరు. వాటి గురించి సరైన అవగాహన లేదు. అలసందల్లో ఎలాంటి రకాలు ఉంటాయి. వాటి పంటకాలం, దిగుబడి గురించి చెప్పండి. – కుమార్, కామారెడ్డి.
అలసందలకు అన్ని రకాల నేలల్లో పండే గుణం ఉంటుంది. అయితే, తేమను పట్టి ఉంచుతూ, మురుగు నీరు నిలువని మధ్యస్థ నేలలు మరింత అనుకూలంగా ఉంటాయి. చెల్క నేలలు, ఎర్ర భూములు, నల్లరేగడి భూముల్లోనూ విరగ కాస్తాయి. వేసవిలో దిగుబడి పొందాలనుకొంటే, ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు. ప్రస్తుతం అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పంటకాలంతోపాటు దిగుబడిని, తెగుళ్లను తట్టుకొనేవాటిని ఎంచుకోవడం మంచిది.