Tech Majors 2 Steps Verification | పెరిగిపోతున్న సైబర్ నేరాలను తగ్గించడానికి టెక్ సంస్థలు తమ కస్టమర్లకు సురక్షితమైన సేవలందించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా సెర్చింజన్ గూగుల్ తన యూజర్లు లాగిన్ కావడానికి టూ స్టెప్స్ వెరిఫికేషన్ విధానాన్ని తప్పనిసరి చేయబోతున్నది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ పాలసీ అమలులోకి రానున్నది. ఈ ఏడాది చివరికల్లా తమ యూజర్లు 150 మిలియన్ల మంది గూగుల్ యూజర్లు, 20 లక్షల యూ-ట్యూబ్ యూజర్లు ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ విధానంలోకి రావాల్సిందేనని స్పష్టం చేసింది.
సైబర్ నేరగాళ్ల నుంచి రక్షణ కల్పించడానికి ఇది రక్షణ కవచంగా భావించవచ్చు. ఇప్పటికే పలువురు యూజర్లు ఈ టూ స్టెప్స్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారు. ఈ నెల 9 లోగా అనేబుల్ చేయకపోతే, తర్వాత ఆటోమేటిక్‌గా టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ యాక్టివేట్ అవుతుంది.
యూజర్లు జీ-మెయిల్ ఐడీతో గూగుల్లోకి లాగిన్ అయిన తర్వా కుడివైపు ఫోటో ఐకాన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని వస్తుంది. అటుపై గూగుల్ అకౌంట్ షెట్టింగ్స్ వస్తాయి. వాటిలో సెక్యూరిటీ ఆప్షన్ క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే టూ స్టెప్స్ వెరిఫికేషన్ ఫీచర్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఆఫ్ అని ఉన్న ఆప్షన్ క్లిక్ చేస్తే, వెరిఫికేషన్ పూర్తి చేయమని సూచిస్తుంది. తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది పూర్తి చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.