హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఆసియాకప్‌లో బరిలోకి దిగుతున్న టీమ్ఇండియాకు భారత్ ఆర్మీ మద్దతుగా నిలిచింది. పాకిస్థాన్ వేదికగా మొదలైన ఆసియాకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ టైటిల్ ఫెవరేట్‌గా పోటీపడుతున్నది. ఈ నేపథ్యంలో జూజ్లీహిల్స్లోని బీ-డబ్స్లో బుధవారం సమావేశమైన భారత్ ఆర్మీ, ఆరెంజ్ ఆర్మీ..భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించాయి.
అనంతరం బ్యాండ్‌తో మార్చ్ఫాస్ట్ చేసి ఆల్ ద బెస్ట్ టీమ్ఇండియా అంటూ నినదించారు. దాదాపు 10 లక్షల మంది సభ్యులు 1990 నుంచి భారత్ ఆర్మీ సభ్యులుగా కొనసాగుతుండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఆరెంజ్ ఆర్మీ 2015 నుంచి టీమ్ఇండియాకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ క్లబ్ ఫౌండర్ ధర్మరక్షిత్ తదితరులు పాల్గొన్నారు.