ఆకట్టుకున్న టీసీఎస్.. క్యూ4లో రూ.13,718 కోట్ల లాభం
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.13,718 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.12,224 కోట్ల లాభంతో పోలిస్తే 12.22 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది.
ముంబై, ఏప్రిల్ 9 : దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.13,718 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.12,224 కోట్ల లాభంతో పోలిస్తే 12.22 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. అలాగే డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ.10,657 కోట్ల లాభం కంటే భారీ వృద్ధిని నమోదు చేసుకోవడం విశేషం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.64 శాతం ఎగబాకి రూ.70,698 కోట్లకు చేరుకున్నది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ కే కృతివాసన్ మాట్లాడుతూ..వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఆశాజనక పనితీరు కనబరిచినట్టు, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ రెండంకెల వృద్ధిని సాధించినట్టు చెప్పారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 12 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు, వీటిలో ఉత్తర అమెరికా నుంచి 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందాలు రాగా, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల నుంచి మరో 2.8 బిలియన్ డాలర్ల ఒప్పందాలు వచ్చాయన్నారు.
- 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2.67 లక్షల కోట్ల ఆదాయంపై రూ.49,210 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
- గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీలో ఉద్యోగులు 23,460 మంది తగ్గుముఖం పట్టారు. వీరిలో టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా 12 వేల మంది సిబ్బందిని తొలగించింది.
- నాలుగో త్రైమాసికంలో కొత్తగా 2,356 మంది సిబ్బందిని మాత్రమే రిక్రూట్ చేసుకున్నది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 5,84,519కి చేరుకున్నారు.
- గడిచిన ఆర్థిక సంవత్సరానిగాను షేరు హోల్డర్లకు రూ.31 తుది డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.
- పెంచిన ఉద్యోగుల వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది.
- కంపెనీలో ఉద్యోగుల వలసలు 13.7 శాతంగా ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

