న్యూఢిల్లీ, జూన్ 3 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ సరికొత్త ఈవీ మాడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా సంస్థ నూతన హారియర్ ఈవీను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది మొదట్లో నూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ మాడల్ ఆరు నెలల తర్వాత ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ.21.49 లక్షలు. 75 కిలోవాట్ల బ్యాటరీ, 65 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 627 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 6.3 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోనున్నది.
పనోరమిక్ సన్‌రూఫ్, 14.5 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ ైక్లెమెట్ కంట్రోల్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా, 12.25 ఇంచుల పూర్తిస్థాయిలో కలర్ టచ్‌స్క్రీన్, లెవల్ 2 అడాస్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్ ఉన్నా యి. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ బుకింగ్‌ను ఇప్పటికే ప్రారంభించింది. బ్యాటరీ ప్యాక్‌పై జీవితకాలం వ్యారెంటీ కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 25 వేల యూనిట్లు అమ్ముడవుతున్న ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ వాహనంతో మరింత పెరిగే అవకాశం ఉన్నదని టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు.