పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సినీ హీరో తనీష్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. గొప్ప సంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్ ఆరంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి పరిరక్షణతో పాటు పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.