Jailer Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dileep Kumar) తెరకెక్కించిన తాజా చిత్రం జైలర్ (Jailer). యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తొలిరోజు నుంచే పాజిటీవ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ సరికొత్త లుక్‌తో అదరగొట్టారు.
అన్నాత్తే (Annathe) వంటి భారీ డిజాస్టార్ తర్వాత అటు రజనీకాంత్, బీస్ట్ ప్లాఫ్ తర్వాత ఇటు నెల్సన్ ఇద్దరు మాస్ కంబ్యాక్ ఇచ్చారని నెటిజెన్లు తెలుపుతున్నారు. ఇక ఈ సినిమాను తమిళనాడు (Tamilanadu CM) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తాజాగా వీక్షించారు. ఈ విషయాన్ని జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dileep Kumar) ట్విట్టర్లో తెలిపారు.
“‘జైలర్ మూవీ చూసిన సీఎం స్టాలిన్ సర్ కి నా కృతజ్ఞతలు. మీరిచ్చిన స్ఫూర్తికి, ప్రశంసలకు రుణపడి ఉంటాను. మీ మాటలతో చిత్ర యునిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం’ అంటూ నెల్సన్ తన ట్విట్టర్లో రాసుకోచ్చారు. ఇక జైలర్ మూవీ విడుదలైన తొలిరోజు నుంచే కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. అన్ని థియేటర్లలో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌తో దుసుకుపోతోంది. ఈ సినిమా 3 రోజులకే 150 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో పాటు మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్, ప్రియాంక అరుళ్మోహన్ వంటి స్టార్ కాస్ట్ ముఖ్య పాత్రలో నటించారు.
Thank you u so much honourable Chief minister @mkstalin sir for watching #jailer … thanks for all the appreciation and motivation sir 🙏🙏😊😊 cast and crew is really happy with ur words 😊🙏 @rajinikanth sir #kalanithimaran sir #kaviyamaran @anirudhofficial @sunpictures pic.twitter.com/3L4LUY5XMd
— Nelson Dilipkumar (@Nelsondilpkumar) August 11, 2023