చెన్నై: తమిళనాడులో సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశించింది. పోటీల్లో 300 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. జల్లికట్టులో పాల్గొనేవారు, నిర్వాహకులు, ప్రేక్షకులు రెండు డోసులు టీకాలు తీసుకొని ఉండాలని స్పష్టంచేసింది. అలాగే గడిచిన 48 గంటల వ్యవధిలో చేయించిన ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఆదేశించింది. పోటీలను వీక్షించేందుకు బహిరంగ ప్రదేశాల్లో 150 మంది లేదా సీటింగ్ కెపాసిటీలో 50 శాతం మంది మాత్రమే ఉండాలని పేర్కొన్నది.